LIC IPO: పబ్లిక్ ఇష్యూకు ఎల్ఐసీ.. దరఖాస్తు చేసుకోండి మరి

ఆశగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓ పబ్లిక్ ఇష్యూకు వచ్చేసింది. మే9 వరకూ అందుబాటులో ఉంటుండగా.. బుధవారం నుంచే ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కొనుగోలు చేసుకునేందుకు రిటైల్ మదుపర్లు, పాలసీదార్లు, తొలిసారి పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంటున్న వారూ ఆసక్తి కనబరుస్తున్నారు.

LIC IPO: పబ్లిక్ ఇష్యూకు ఎల్ఐసీ.. దరఖాస్తు చేసుకోండి మరి

Lic

LIC IPO: ఆశగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓ పబ్లిక్ ఇష్యూకు వచ్చేసింది. మే9 వరకూ అందుబాటులో ఉంటుండగా.. బుధవారం నుంచే ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కొనుగోలు చేసుకునేందుకు రిటైల్ మదుపర్లు, పాలసీదార్లు, తొలిసారి పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంటున్న వారూ ఆసక్తి కనబరుస్తున్నారు.

వీటి ధర రూ.902 నుంచి రూ.949 వరకూ ఉండొచ్చని ప్రకటించారు. డిస్కౌంట్ ను పాలసీదార్లకు రూ.60 చొప్పున రిటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున అందజేయనున్నారు.

30 కోట్ల పాలసీదార్లు, 13లక్షల మంది ఏజెంట్లు ఉన్న ఎల్ఐసీకి బీమా ప్రీమియంలో 64శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడిని దృష్టిలో పెట్టుకుని ఐపీఓకి దరఖాస్తు చేస్తే మంచి లాభాలు ఉండొచ్చని, అప్పటి వరకూ ఎదురుచూడాల్సి ఉంటుందని జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ ఛైర్మన్ రవి సింఘాల్ అంటున్నారు.

Read Also: ఎల్ఐసీ షేరు ధర ఫిక్స్.. ఎంతంటే?!

అయితే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం మే 2, 2022 సోమవారమే ఈ ఐపీఓ అందుబాటులోకి వచ్చింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.5వేల 627.3 కోట్లను ఆర్జించింది. 5కోట్ల 92లక్షల 96వేల 853 ఈక్విటీ షేర్ల కోసం యాంకర్ ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో షేరును రూ.949 వద్ద కొనుగోలు చేశారు.

దేశంలోని అన్ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, మార్కెట్ నిపుణులు ఎల్ఐసీ ఐపీఓ ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తుండటంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.