PAN Aadhaar DeLink : మీ పాన్-ఆధార్ తప్పుగా లింక్ అయిందా? ఎలా డీలింక్ చేయాలో తెలుసా? ఏ డాక్యుమెంట్లు కావాలి? ఫీజు ఎంతంటే?

PAN Aadhaar DeLink : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేస్తున్నప్పుడు పాన్ తప్పు ఆధార్ నంబర్‌తో లింక్ అయిందని గుర్తించారా? చాలా మంది తమ ఆధార్‌ను తప్పు పాన్‌తో లింక్ చేశారని ఫిర్యాదు చేస్తున్నారు.

PAN Aadhaar DeLink : మీ పాన్-ఆధార్ తప్పుగా లింక్ అయిందా? ఎలా డీలింక్ చేయాలో తెలుసా? ఏ డాక్యుమెంట్లు కావాలి? ఫీజు ఎంతంటే?

Linked PAN Card with wrong Aadhaar

PAN Aadhaar DeLink : పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN)ని ఆధార్ నంబర్‌తో లింక్ చేసేందుకు గడువు ఇప్పటికే జూన్ 30, 2023తో ముగిసింది. గడువులోపు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైన బ్యాంక్ లావాదేవీలతో సహా అనేక ఆర్థిక సర్వీసులను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆధార్‌తో లింక్ చేయని పాన్ ఇన్‌యాక్టివ్ అవుతుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడంలో సమస్యలకు కూడా దారి తీస్తుంది. అయినప్పటికీ, చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేస్తున్నప్పుడు పాన్ తప్పు ఆధార్ నంబర్‌తో లింక్ అయినట్టు ఫిర్యాదు చేస్తున్నారు. చాలా మంది తమ ఆధార్‌ను తప్పు పాన్‌తో లింక్ చేశారని ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌లో ఆదాయపు పన్ను శాఖతో సమస్యను లేవనెత్తారు.

తప్పు పాన్ నుంచి ఆధార్‌ను ఎలా డిలింక్ చేయాలి? :
పన్ను చెల్లింపుదారులు ముందుగా తమ పాన్, ఆధార్‌ను డీలింక్ చేయాలి. ఆపై సరైన ఆధార్ నంబర్‌తో పాన్‌ను లింక్ చేసేందుకు దశలను ఫాలో అవ్వండి. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయడం ద్వారా చేయవచ్చు. ఐటీ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. జురిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ (JAO)కి అభ్యర్థనను సమర్పించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా చేయవచ్చు.

Read Also : Nothing Phone 2 Launch : సూపర్ ఫీచర్లతో నథింగ్ ఫోన్ (2) వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ చేయడం ద్వారా JAO కాంటాక్టు వివరాలను పొందవచ్చు. ఆధార్, పాన్‌ను డీలింక్ చేసే ప్రక్రియ చాలా సులభమని గుర్తించాలి. ఈ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు. (Regional Computer Centre) ద్వారా ఆదాయపు పన్ను బిజినెస్ అప్లికేషన్ నుంచి ఆడిట్ లాగ్‌ కోసం రిక్వెస్ట్ ఇవ్వండి. సమస్యకు కారణాన్ని గుర్తించండి. పాన్, ఆధార్‌ను డీలింక్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లతో పాటు JAOకి అప్లికేషన్ సమర్పించండి.

పాన్-ఆధార్‌ను డీలింక్ చేసేందుకు డాక్యుమెంట్లు ఇవే :
* ఒరిజినల్ ఆధార్, ఆధార్ కాపీ (జిరాక్స్) ఒకటి
* ఒరిజినల్ పాన్ కార్డ్ కాపీ (జిరాక్స్).
* ఒక కంప్లయింట్ లెటర్

Linked PAN Card with wrong Aadhaar

Linked PAN Card with wrong Aadhaar

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ మార్గదర్శకాల ప్రకారం.. పాన్ హోల్డర్లందరూ చివరి తేదీలోగా ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. డాక్యుమెంట్లను లింక్ చేయడంలో వైఫల్యం ఎదుర్కొంటున్నారు. iPAN జూలై 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. అంతకుముందు, గడువు తేదీ మార్చి 31, 2023, కానీ ప్రభుత్వం జూన్ 30, 2023 వరకు పొడిగించింది. గడువు తేదీ ముగిసిన తర్వాత, రెండు డాక్యమెంట్లను లింక్ చేసేందుకు ప్రభుత్వం రూ. 1,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. పాన్, ఆధార్‌ను తప్పుగా లింక్ చేసినట్లయితే.. ఒకటి మొదట డీలింక్ చేసి.. ఆపై రెండు డాక్యుమెంట్‌లను లింక్ చేసే విధానాన్ని ఫాలో చేయాలి. అయితే, అవసరమైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

గడువు తేదీ తర్వాత పాన్, ఆధార్ ఎలా లింక్ చేయాలి? :
* ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
* ప్రొఫైల్ విభాగంలో ‘Link Aadhaar’పై Click చేయండి.
* సరైన పాన్, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
* ఇ-పే ట్యాక్స్ ద్వారా చెల్లించడానికి ‘Continue’పై క్లిక్ చేయండి.
* OTPని పొందడానికి మీ PAN, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
* నంబర్ ధృవీకరణ తర్వాత, పేజీ e-Pay Tax పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
* AY 2024–25 ఎంచుకోండి, పేమెంట్ ‘ఇతర రసీదులుగా టైప్ చేసి, ‘Continue’పై క్లిక్ చేయండి.
* రుసుము చెల్లించిన తర్వాత, మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు.

Read Also : Apple iPhone 14 Discount : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!