అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ స్టైల్లో మెక్ డొనాల్డ్

అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ స్టైల్లో మెక్ డొనాల్డ్

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యాపారాల్లోనూ ట్రెండ్‌లు మారిపోతున్నాయి. అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్ తన టెక్నికల్ నాలెడ్జ్‌తో చక్కటి బిజినెస్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫిషయిల్ ఇంటలిజెన్స్ అమెజాన్, గూగుల్ వంటి వాటిపై బాగా పనిచేస్తుంది. ఇంతటి సాంకేతికతకు ఇన్నాళ్లూ దూరంగా ఉన్న మెక్ డొనాల్డ్ కూడా అడుగుపెట్టనుంది.

దీని సహాయంతో మనం అంతకుముందు మెక్ డొనాల్డ్‌లో కొనుగోలు చేసిన వస్తువుతో పాటు దానికి సంబంధించిన ఆహారం, లేదా దానికి దగ్గరి రుచి ఉన్న ఆహారాన్ని అందించేందుకు వీలుగా ఉంటుందని మెక్ డొనాల్డ్ యాజమాన్యం తెలిపింది. ఎన్నాళ్లుగానో తమ ఫుడ్‌కు అలవాటు పడ్డ కస్టమర్లును వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ కారణంతోనే వినియోగదారులకు మరింత సులభతరం చేసేందుకు లేటెస్ టెక్నాలజీ తీసుకురానున్నట్లు వెల్లడించారు. 

కస్టమర్‌ యాంగిల్‌లో ఆలోచించి అవసరమైన దానిని అందించడంతో పాటు దానితో పాటు ఇంకా ఏది ఉంటే బాగుంటుందో ఈ టెక్నాలజీ చెప్పేస్తుంది. ప్రస్తుతం మెక్ డొనాల్డ్ స్టైల్ మార్చుకుని వ్యాపారం మరింత పుంజుకునే ప్రయత్నాలు చేస్తుంది. 300మీటర్ల దూరంగా ఉండగానే ఆర్డర్ ఇస్తే.. మనం రెస్టారెంట్ చేరుకునేలోపే ఫుడ్ రెడీ చేసి ఉంచుతుంది. ఇలా అవుట్ లెట్ ఆర్డర్లను రెడీ చేసి ఉంచుతూ కస్టమర్లను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది మెక్ డొనాల్డ్.