Mercedes-Benz : ఎలక్ట్రిక్‌ Vision EQXX కారు వస్తోంది.. సింగిల్ ఛార్జ్‌‌తో వెయ్యి కి.మీ దూసుకెళ్తుంది!

మెర్సిడెజ్‌ బెంజ్‌ కూడా ఈవీ కార్లను అధిక రేంజ్‌తో తీసుకొస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌ చేస్తే ఏకంగా 1000కిమీ మేర ప్రయాణించగలదు.

Mercedes-Benz : ఎలక్ట్రిక్‌ Vision EQXX కారు వస్తోంది.. సింగిల్ ఛార్జ్‌‌తో వెయ్యి కి.మీ దూసుకెళ్తుంది!

Mercedes Ready To Unveil Vision Eqxx Concept, With 1,000 Km Range, On January 3

Mercedes-Benz EV Car : కొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 3న మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఎలక్ట్రిక్ కారును సింగిల్ ఛార్జ్ చేస్తే చాలు.. 1000 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. ఆటోమొబైల్ కంపెనీల్లో అందులోనూ ఎలక్ట్రిక్ కార్లలో రారాజు ఎవరంటే.. టక్కును గుర్తుచ్చేది టెస్లానే.. ఇప్పుడా టెస్లాకు దీటుగా ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా సై అంటున్నాయి. టెస్లాకు పోటీగా ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లల్లో రేంజ్‌ పెంచడమే ఇప్పుడీ కంపెనీల టార్గెట్..

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌ (Mercedes- Benz)కూడా ఈవీ కార్లను అధిక రేంజ్‌తో తీసుకొస్తోంది. ఎలక్ట్రిక్‌ కార్ల రేంజ్‌ పై మెర్సిడెజ్‌ బెంజ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది. Vision EQXX concept ఈవీ కారును అధిక రేంజ్‌తో త్వరలో ప్రవేశపెట్టబోతోంది. ఈవీ కారును సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 1000కిమీ మేర ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది జనవరి 3 మెర్సిడెజ్‌ Vision EQXX concept కారును లాంచ్ చేయనుంది.

దీనికి సంబంధించి కంపెనీ టీజర్‌ను కూడా లాంచ్‌ చేసింది. ఈవీ కార్లలో ఎరోడైనమిక్స్‌ (aerodynamics) ఫీచర్‌తో, అత్యధిక వేగంగా వెళ్లే కారుగా నిలుస్తోందని కంపెనీ సీవోవో మార్కస్‌ స్కాఫర్‌ (Schäfer) వెల్లడించారు. మెర్సిడెజ్‌లోని EQXX concept కంటే తక్కువ డ్రాగ్‌ కోఫిషియంట్‌ EQXX కలిగి ఉంటుందని మార్కస్‌ తెలిపారు. ఈ కారులో బ్యాటరీ ప్యాక్ హైలట్ గా నిలువనుందని మార్కస్ చెప్పారు.

Read Also : New Variant : రెండు డోసులు వేసుకుంటేనే..రాష్ట్రంలోకి రానిస్తాం..మళ్లీ ఆ రోజులు వస్తాయా ?