Moto G22 : ఇండియాలో ఫస్ట్ G37 ప్రాసెసర్‌తో Moto G22 కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?

Moto G22 : మోటరోలా ఎట్టకేలకు భారత మార్కెట్లోకి Moto G22 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. బడ్జెట్ ఫోన్లలో Motorola అందించే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకర్షించేలా ఉంది.

Moto G22 : ఇండియాలో ఫస్ట్ G37 ప్రాసెసర్‌తో Moto G22 కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?

Moto G22 With Mediatek Helio G37 Processor Launched In India, Price Set At Rs 10,999

Moto G22 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటరోలా ఎట్టకేలకు భారత మార్కెట్లోకి Moto G22 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ భారత మొట్టమొదటి MediaTek Helio G37 ప్రాసెసర్‌తో వచ్చింది. ఈ ఫోన్ బడ్జెట్ కొనుగోలుదారులే లక్ష్యంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది కంపెనీ. 6.5-అంగుళాల 90 Hz మాక్స్ విజన్ డిస్‌ప్లే, 20W TurboPower ఛార్జర్‌తో సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ లైఫ్‌ అందిస్తోంది. మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆస్తకికరమైన విషయం ఏమిటంటే.. బడ్జెట్ ఫోన్ అయినా.. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌తో వస్తోంది.

Moto G22 స్మార్ట్ ఫోన్.. Redmi 10, Realme C35 స్మార్ట్ ఫోన్లకు పోటీగా మార్కెట్లోకి వచ్చింది. బడ్జెట్ ఫోన్లలో Motorola అందించే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. ఎందుకంటే మోటరోలా ఐఫోన్ లాంటి ఫ్లాట్‌బెడ్ డిజైన్‌ మాదిరిగా తీసుకొస్తోంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో మోటరోలా బ్రాండింగ్ మధ్యలో ప్యానెల్‌లు ఉన్నాయి. వెనుక ప్యానెల్‌లో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ స్పెషల్ అట్రాక్షన్.. ఇందులో నాలుగు కెమెరా సెన్సార్లు కూడా ఉన్నాయి. Moto G22 ధర ఎంత, డివైజ్ స్పెసిఫికేషన్‌లు ఏమి ఉన్నాయో ఓసారి చూద్దాం..

Moto G22 With Mediatek Helio G37 Processor Launched In India, Price Set At Rs 10,999 (1)

Moto G22 With Mediatek Helio G37 Processor Launched In India, Price Set At Rs 10,999

Moto G22: ధర ఎంతంటే? :
Moto G22 సింగిల్ 4GB+64GB వేరియంట్ ధర రూ. 10,999లకు అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 1000 తగ్గింపుతో ఈ డివైజ్ పొందవచ్చు. దీని ధర డిస్కౌంట్ ధరతో రూ. 9999కి తగ్గింది. స్టాక్‌ ముగిసే వరకు లిమిటిడ్ పిరియడ్ మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్.. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 14 మధ్య అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ఏప్రిల్ 13న ప్రత్యేకంగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్ ఐస్‌బర్గ్ బ్లూ, కాస్మిక్ బ్లాక్‌తో సహా రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. Motorola త్వరలో మూడవ కలర్ వేరియంట్ కూడా తీసుకురానుంది. చూడటానికి కలర్ ఫుల్‌గా పుదీనా ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది.

Moto G22 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేస్తుంది. 6.5-అంగుళాల మాక్స్ విజన్ డిస్‌ప్లేతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Helio G37 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 64GB స్టోరేజ్ ఆప్షన్ అందించారు. మైక్రో SD కార్డ్‌ తో స్టోరేజీని పెంచుకోవచ్చు. Moto G22 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ కలిగి ఉంది, ఇందులో 50-MP ప్రైమరీ కెమెరాతో పాటు 8-MP అల్ట్రా వైడ్ లెన్స్ కూడా ఉన్నాయి. ఈ ధర విభాగంలో 8-MP అల్ట్రా వైడ్ లెన్స్‌ను అమర్చారు. మొదటి ఫోన్ Moto G22 స్మార్ట్ ఫోన్లో మాక్రో సెన్సార్‌తో పాటు డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీల కోసం డివైజ్ ఫ్రంట్ భాగంలో 16MP కెమెరా ఉంది. Moto G22 20W టర్బోచార్జర్‌కు సపోర్టుతో 5000 mAh బ్యాటరీతో వచ్చింది.

Read Also : Chinese Smartphone Makers : భారత్‌లో ఫోన్ల తయారీకి 3 చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాల ప్లాన్..!