Motorola Edge 40 Neo : కొత్త ఫోన్ కావాలా? మోటోరోలా ఎడ్జ్ 40 నియో సేల్ మొదలైందోచ్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?

Motorola Edge 40 Neo Sale : మోటోరోలా లేటెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటో (Moto Edge 40 Neo) సెప్టెంబర్ 29 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Motorola Edge 40 Neo : కొత్త ఫోన్ కావాలా? మోటోరోలా ఎడ్జ్ 40 నియో సేల్ మొదలైందోచ్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?

Motorola Edge 40 Neo Sale Today _ Should you buy

Motorola Edge 40 Neo Sale : ప్రముఖ (Motorola) అధికారిక వెబ్‌సైట్, (Flipkart), ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేక ఫెస్టివల్ లాంచ్ ఆఫర్‌ (Special Festival Sale)లో భాగంగా, 8GB/128GB, 12GB/256GB మోడల్‌లు రెండూ రూ. 3వేలు తగ్గింపును పొందవచ్చు. వరుసగా ఈ ఫోన్ల ధరలను రూ. 20,999, రూ. 22,999లకు సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ 144Hz పోలెడ్ డిస్‌ప్లేను అందిస్తుంది.

మోటోరోలా (Motorola Edge 40 Neo) 6.55-అంగుళాల 144Hz ఫుల్-HD+ (1080×2400 పిక్సెల్‌లు) 10-బిట్ పోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేను 1,300nits గరిష్ట ప్రకాశం, HDR10+ సపోర్టుతో కలిగి ఉంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది.

Read Also : Motorola Edge 40 Neo Launch : మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 21నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

మోటో ఎడ్జ్ 40 నియో బ్యాటరీ ఎంతంటే? :
మోటోరోలా ఎడ్జ్ 40 నియో, MediaTek Dimensity 7030 SoC ద్వారా అందిస్తుంది. గరిష్టంగా 12GB వరకు LPDDR5 RAM, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ డివైజ్ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ని కలిగి ఉంది. 2 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు. ఇతర ఫీచర్లలో 5G, NFC, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola Edge 40 Neo Sale Today

Motorola Edge 40 Neo Sale Today

మోటోరోలా ఎడ్జ్ 40 నియో ధర, కలర్ వేరియంట్లు :
మోటో ఎడ్జ్ 40 నియో ఫోన్ బ్లాక్ బ్యూటీ, సూతింగ్ సీ, కెనీల్ బే అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. కస్టమర్‌లు 2 మెమరీ కాన్ఫిగరేషన్‌ల మధ్య ఎంచుకోవచ్చు. 128GB స్టోరేజ్ మోడల్‌తో 8GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో 12GB RAM కలిగి ఉన్నాయి. ఈ మోడళ్ల ఒరిజనల్ ధరలు వరుసగా రూ. 23,999, రూ. 25,999గా ఉన్నాయి. ధర తగ్గింపు లిమిటెడ్ టైమ్ మాత్రమేనని కొనుగోలుదారులు గమనించాలి.

మోటోరోలా Edge 40 నియో కొనాలా? వద్దా? :
మోటో ఎడ్జ్ 40 నియో ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. అద్భుతమైన డిజైన్, స్లిమ్ ఫారమ్ ఫ్యాక్టర్, కర్వ్డ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ కారణంగా మృదువైన స్క్రోలింగ్‌ను అందిస్తుంది. MediaTek డైమెన్సిటీ 7030 ప్రాసెసర్, రోజువారీ పనులు, గేమింగ్ వేగవంతమైన పర్ఫార్మెన్స్ నిర్ధారిస్తుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు బ్యాటరీ టాప్-అప్‌లను అనుమతిస్తుంది. కెమెరా విభాగంలో OIS, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

Read Also : iPhone 15 Pro Models Sale : భారత్ సహా 20కి పైగా దేశాల్లో ఐఫోన్ 15 ప్రో మోడల్స్ సేల్.. విదేశాల్లో ఉన్నా ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!