Moto G200 : మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్.. ఇండియాకు వచ్చేస్తోంది!

మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. హైఎండ్ ఫీచర్లతో నవంబర్ 30న భారత మార్కెట్లో రానుంది. అదే.. Moto G200 ఫోన్.. స్నాప్ డ్రాగన్ 888+తో అతి త్వరలో లాంచ్ కానుంది.

Moto G200 : మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్.. ఇండియాకు వచ్చేస్తోంది!

Motorola May Launch Moto G200 With Snapdragon 888+ In India In November (1)

Moto G200 SmartPhone : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. హైఎండ్ ఫీచర్లతో నవంబర్ 30న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అదే.. Moto G200 ఫోన్.. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ హైఎండ్ స్మార్ట్ ఫోన్.. స్నాప్ డ్రాగన్ 888+తో అతి త్వరలో ఇండియాకు రానుంది. ఈ మేరకు టిప్ స్టర్ టెక్ నిపుణులు దేవ‌య‌న్ రాయ్ (Debayan Roy) వెల్ల‌డించారు. స్నాప్‌డ్రాగ‌న్ 888+తో కూడిన మోటో G200 ధ‌ర రూ 35,000గా ఉంటుందని అంచనా. Motorola ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి ఫీచర్లను రివీల్ చేయలేదు. కానీ, స్నాప్‌డ్రాగన్ 888+తో కూడిన Moto G200 ఫోన్ మోడల్ లాంచ్ కాబోతున్నట్టు టిప్ స్టర్ ధ్రువీకరించింది. Moto G200 ఫోన్‌తో పాటు Motorola Moto G71, G51 Moto G31 సహా మరెన్నో బడ్జెట్ ఆఫర్‌లను భారత మార్కెట్లో ప్రారంభించనుంది. ఈ మూడు మోటో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే యూరప్‌లో లాంచ్ అయ్యాయి. కొత్త Moto ఫోన్‌ ఇండియాలో లాంచ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే Moto G200 లాంచ్ సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెల్లడించలేదు.

Moto G200 ధర (రూ.37,900) అంచనా :
Moto G200 స్మార్ట్ ఫోన్.. ప్రారంభ ధర 450 యూరోలు (సుమారు రూ. 37,900) ఉండనుంది. ప్రస్తుతం లాటిన్ అమెరికాలో మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 35,000 వరకు ఉండవచ్చు.

Moto G200 ఫీచర్లు (అంచనా) :
మోటో స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. Moto G200 ఫోన్ 6.8-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో 144Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Moto G200 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ SoC ద్వారా పనిచేస్తుంది. 8GB RAM, 256GB RAMతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒకే RAM వేరియంట్‌లో మార్కెట్లోకి రానుంది. కానీ, 128GB, 256GB సహా రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తుంది.

కెమెరా ఫీచర్లు అయితే.. Moto G200 ఫోన్‌లో 108MP ప్రధాన కెమెరాతో పాటు 13MP అల్ట్రా-వైడ్-మాక్రో కెమెరా డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫ్రెంట్ సైడ్ సెల్ఫీల కోసం 16-MP కెమెరా ఉంది. ఫోన్ 8K వీడియో, 960 fps స్లో-మోషన్ వీడియో కూడా ఉంది. ఇతర ఫార్మాట్ వీడియో రికార్డింగ్ లకు కూడా సపోర్ట్ చేస్తుంది. Moto G200 33W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : WhatsApp Web Tricks : వాట్సాప్‌ వెబ్‌లో ఈ సూపర్ షార్ట్‌కట్స్‌.. తప్పక తెలుసుకోండి!