New Jio 5G Phones : అత్యంత సరసమైన ధరలో రెండు కొత్త జియో 5G ఫోన్లు.. ఈ నెలాఖరులోనే లాంచ్.. ఇదిగో ప్రూఫ్!

New Jio 5G Phones : కొత్త జియో ఫోన్‌లు, జియో 5G ఫోన్‌లు, రాబోయే రిలయన్స్ (AGM 2023)లో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. సాధారణ వార్షిక సమావేశం ఆగస్టు 28న జరగవచ్చు.

New Jio 5G Phones : అత్యంత సరసమైన ధరలో రెండు కొత్త జియో 5G ఫోన్లు.. ఈ నెలాఖరులోనే లాంచ్.. ఇదిగో ప్రూఫ్!

New Jio phones spotted on Indian BIS certification site

New Jio 5G Phones : జియో అభిమానులకు అదిరే వార్త.. ఈ నెలాఖరులో రిలయన్స్ జియో (Reliance Jio) నుంచి రెండు కొత్త 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశానికి ముందు.. భారత్ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో 2 కొత్త జియో ఫోన్‌లను గుర్తించింది. దేశ మార్కెట్లో జియో కొత్త ఫోన్లు అతి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.

91మొబైల్స్ నివేదిక ప్రకారం.. రాబోయే రెండు మోడల్‌లు ‘JBV161W1’, ‘JBV162W1’ సీరియల్ నంబర్‌లను కలిగి ఉన్నాయని టిప్‌స్టర్ ముకుల్ శర్మ మొదటిసారిగా గుర్తించినట్లు తెలిపారు. ఫోన్ స్పెసిఫికేషన్లు అస్పష్టంగా ఉన్నప్పటికీ.. కొత్త జియో ఫోన్‌లు ఒకే మోడల్‌గా ఉండవచ్చు. కానీ, విభిన్న కలర్ ఆప్షన్లలో ఉంటాయి. ఆగస్టు నెలాఖరులో Jio 5G ఫోన్ లాంచ్ అవుతుందనే ఊహాగానాల మధ్య ఈ ఫోన్‌లు BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి.

భారత 2G-రహిత (2G-mukt) దేశంగా మార్చే ప్రయత్నంలో భాగంగా రిలయన్స్ గతంలో అనేకసార్లు (Reliance Jio 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ అయ్యే ప్రణాళికలను వెల్లడించింది. CPU బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్ గీక్‌బెంచ్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌తో జియో ఫోన్ రానుందని నివేదిక గుర్తించింది. గతంలో అమెరికన్ చిప్‌మేకర్‌తో జియో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

Read Also : WhatsApp Multiple Accounts : ఒకే ఫోన్‌లో మల్టీపుల్ వాట్సాప్ అకౌంట్లను వాడొచ్చు తెలుసా? ఎప్పటినుంచంటే?

గీక్‌బెంచ్ లిస్టింగ్ స్మార్ట్‌ఫోన్‌లో 4GB RAM ఉండవచ్చునని సూచిస్తుంది. (Jio 5G) ఫోన్‌కు సంబంధించిన ఇతర లీక్‌లు 6.5-అంగుళాల HD+ LCD 90Hz స్క్రీన్, 5,000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ని సూచిస్తున్నాయి. ముందు భాగంలో, సెల్ఫీలకు 8MP సెన్సార్ ఉండవచ్చు. కంపెనీ కనీసం 18W ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.

New Jio phones spotted on Indian BIS certification site

New Jio 5G Phones spotted on Indian BIS certification site

జియో జనాలకు సరసమైన రేంజ్‌లో ఫోన్‌లను అందించవచ్చు. జియో 5G ఫోన్ ధర రూ. 10వేల లోపు ఉంటుందని అంచనా. మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లలో అనుకూల Jio OSని అమలు చేస్తుందని ఆశించవచ్చు. ఆండ్రాయిడ్ పైన కస్టమ్ ఇంటర్‌ఫేస్‌ను రూపొందించడానికి కంపెనీ గూగుల్‌తో కలిసి పనిచేస్తోంది.

ఇటీవలే రెండు Jio 4G ఫోన్‌లను ఒక్కొక్కటి రూ.999కి రిలీజ్ చేసింది. 4G ఫోన్‌లలో ఒకటి భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కార్బన్‌తో కలిసి తయారైంది. జియో బ్రాండింగ్ కింద సరసమైన 4G ఫోన్‌లను రూపొందించడానికి Jio ఇతర బ్రాండ్‌లను కూడా ఆహ్వానిస్తోంది. అయితే, ఫిజికల్ కీప్యాడ్‌లతో కూడిన ఓల్డ్-జనరేషన్ ఫీచర్ ఫోన్‌లలో జియో స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ JioPhone Next అని కూడా పిలుస్తారు. Jio 5Gని JioPhone Next 5G అని కూడా చెప్పవచ్చు.

మరోవైపు.. రిలయన్స్ జియో భారత మార్కెట్లో 5G ప్లాన్‌లను ఇంకా ఆవిష్కరించలేదు. AGM 2023లో ఈ ఏడాది చివరి నాటికి అన్ని పట్టణాలు, నగరాలను కవర్ చేయాలనే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తోంది.5G ప్లాన్‌లతో జియో ఎయిర్ ఫైబర్ సర్వీసు అమ్మకాలను పెంచుకోవాలని భావిస్తోంది. జియో ఫైబర్ సర్వీసు కింద గృహాలు, ఆఫీసుల కోసం రూపొందించిన ప్రత్యేక 5G హాట్‌స్పాట్ డివైజ్ కూడా అందిస్తోంది. అదనంగా, అనేక టెక్ కంపెనీల పెట్టుబడి వ్యూహాలలో కీలక అంశమైన AIకి సంబంధించిన కొన్ని ప్రకటనలను కూడా కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది.

Read Also : Flipkart Big Bachat Dhamal Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్.. ఈ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ. 749కే సొంతం చేసుకోండి!