WhatsApp Multiple Accounts : ఒకే ఫోన్‌లో మల్టీపుల్ వాట్సాప్ అకౌంట్లను వాడొచ్చు తెలుసా? ఎప్పటినుంచంటే?

WhatsApp Multiple Accounts : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వాట్సాప్ అకౌంట్లను ఒకే డివైజ్‌లో యాక్సస్ చేసుకోవచ్చు. మల్టీ అకౌంట్లను యాడ్ చేసేందుకు యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తున్నట్లు నివేదించింది.

WhatsApp Multiple Accounts : ఒకే ఫోన్‌లో మల్టీపుల్ వాట్సాప్ అకౌంట్లను వాడొచ్చు తెలుసా? ఎప్పటినుంచంటే?

WhatsApp may soon allow use of multiple accounts on one device, details here

WhatsApp Multiple Accounts : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్లకు యూజర్ ఫ్రెండ్లీ మెసేజింగ్ అనుభవాన్ని అందించడానికి అనేక కొత్త ఫీచర్లను అందిస్తుంది. చాట్ లాక్ ఫీచర్ నుంచి చాట్ ట్రాన్స్‌ఫర్ వరకు కొత్తగా ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే, వాట్సాప్ యూజర్లు తమ ప్లాట్‌ఫారమ్ యాడ్ చేసేందుకు వేచి ఉన్న కొన్ని ఫీచర్లు ఇంకా ఉన్నాయి.

ఒక యాప్‌లో వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించగల సామర్థ్యం ఉంది. అయితే, త్వరలో వాట్సాప్ తమ యూజర్ల కోరికను తీర్చనుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో అకౌంట్ మారడాన్ని మెటా (Meta) ఎలా అనుమతిస్తుంది. అదే యాప్‌లో వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను యాడ్ చేసేందుకు యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌ను మెటా యాజమాన్యంలోని యాప్ అభివృద్ధి చేస్తోంది.

Wabetainfo నివేదిక ప్రకారం.. ఈ కొత్త ఫీచర్‌ చివరకు అదే వాట్సాప్ యాప్‌కి అదనపు అకౌంట్లను యాడ్ చేయనుంది. ప్రస్తుతం, వాట్సాప్ యూజర్లు డివైజ్‌లో ఒక అకౌంట్‌తో లాగిన్ చేయడానికి మాత్రమే అనుమతిస్తుంది. అందువల్ల, వేర్వేరు ఫోన్ నంబర్‌లతో రెండు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించే యూజర్లు రెండు డివైజ్‌లను ఉపయోగించాలి లేదా క్లోన్ చేసిన వాట్సాప్ యాప్‌లను ఉపయోగించాలి.

Read Also : WhatsApp Audio Sessions : వాట్సాప్‌లో కొత్త వాయిస్ చాట్ ఫీచర్.. ఆడియో సెషన్లలో 32 మంది గ్రూపుల సభ్యులు మాట్లాడుకోవచ్చు!

లేదేంటే.. రెండు ఫోన్‌లను ఉపయోగించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా డ్యూయల్ సిమ్ ఎంపికలు ఉన్నవారికి, క్లోన్ చేసిన వాట్సాప్ వెర్షన్‌లను ఉపయోగించడం వల్ల భద్రతాపరమైన ప్రమాదాలు తలెత్తుతాయి. కొత్త ఫీచర్ నిస్సందేహంగా ఈ సమస్యలను పరిష్కరించడంలో వినియోగదారులకు సాయపడనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని, రాబోయే వారాల్లో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.17.8 వాట్సాప్ బీటా అనుకూలమైన అప్‌డేట్‌గా వస్తుంది. అయితే, కొంతమంది వినియోగదారులు కూడా మునుపటి 2.23.17.7 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా అదే ఫీచర్‌ను యాక్సెస్ చేయగలరు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పుడు.. వినియోగదారులు QR కోడ్ బటన్‌కు సమీపంలో ఉన్న యారో ఐకాన్ నొక్కడం ద్వారా కొత్త వాట్సాప్ అకౌంట్ జోడించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

WhatsApp may soon allow use of multiple accounts on one device, details here

WhatsApp may soon allow use of multiple accounts on one device, details here

అదే మెనులో వేరే అకౌంట్‌కు మారడం కూడా సులభం అవుతుంది. లాగ్ అవుట్ చేయడానికి ఎంచుకునే వరకు కొత్తగా యాడ్ చేసిన అకౌంట్ యూజర్ డివైజ్‌లో అలాగే ఉంటుంది. ఈ ఫీచర్ యూజర్లకు మల్టీ అకౌంట్లను నిర్వహించే సౌలభ్యాన్ని అందించడమే కాకుండా ఒకే యాప్‌లో ప్రైవేట్ చాట్‌లు, వర్క్ కానర్వేషన్లు, ఇతర మెసేజ్‌లను ఏకీకృతం చేయడంలో వారికి సాయపడుతుంది.

వ్యక్తిగత నోటిఫికేషన్‌లతో పాటు ప్రత్యేకంగా ఉంటుంది. ఇదిలా ఉండగా, వాట్సాప్ ఇటీవల కొత్త ఫీచర్‌ను యాడ్ చేసింది. బ్యాకప్‌లపై ఆధారపడకుండా యూజర్లు తమ మొత్తం డేటాను కొత్త ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడానికి అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉన్న ‘చాట్ ట్రాన్స్‌ఫర్’ ఫీచర్ గూగుల్ డ్రైవ్ లేదా యాపిల్ బ్యాకప్‌పై ఆధారపడనుంది.

సాధారణ దశలను ఉపయోగించి అదే ఆపరేటింగ్ సిస్టమ్‌తో కొత్త ఫోన్‌కు సజావుగా మారడానికి యూజర్లను అనుమతిస్తుంది. అయితే, వినియోగదారులు తమ ఫోన్ దొంగిలించినప్పుడు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో చాట్‌లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి బ్యాకప్‌ను రూపొందించాలని ప్లాట్‌ఫారమ్ సూచిస్తోంది.

Read Also : WhatsApp Screen Sharing : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో కాల్స్‌ మాట్లాడుతూ.. ఫోన్ స్ర్కీన్ షేరింగ్ చేసుకోవచ్చు..!