Floating Solar Plant : దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్ ప్రారంభం

విశాఖపట్నంలోని సింహాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లోని రిజర్వాయర్ పై ఎన్టీపీసీ 25 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను శనివారం ప్రారంభించింది.

Floating Solar Plant : దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్ ప్రారంభం

Ntpc Solar Power Plant

Floatin Solar Plant : విశాఖపట్నంలోని సింహాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లోని రిజర్వాయర్ పై ఎన్టీపీసీ 25 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను శనివారం ప్రారంభించింది. భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఇదని ఎన్టీపీసీ తెలిపింది.

450 గిగావాట్ల పునురుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని పెంచే  లక్ష్యంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఒక పెను మార్పు.  ధర్మల్ విద్యుత్ కేంద్రాలు స్ధాపించాలి అంటే వాటికున్నఇబ్బందులు చాలా ఉన్నాయి. పెద్ద ఎత్తున అటవీ, వ్యవసాయేతర భూభాగం లభ్యం అవ్వాలి.  వాటి  నిర్మాణం కంటే ధర్మల్ పవర్ ప్లాంట్ లలో  ఉండే కూలింగ్ కెనాల్స్ మీద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లు నిర్మాణం ఎంతో చవకైనది.

సింహాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో నిర్నించిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ దాదాపు 75 ఎకరాల్లో నిర్నించారు. ఇది 7 వేల గృహాల్లో విద్యుత్ అవసరాలను తీరుస్తుంది. ఇందులో ఏర్పాటు చేసిన లక్షకుపైగా ఉన్న సోలార్ పలకల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఏటా 46 వేల టన్నుల బొగ్గును, 1,364మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేస్తుంది.

ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ 2032 నాటికి 60 గిగావాట్లకు ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచడం ద్వారా ధర్మల్ విద్యుత్ కేంద్రాలలో పనిభారం తగ్గి పర్యావరణాన్ని పరిరక్షంచే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీపీసీ తెలంగాణ, రామగుండంలోని ధర్మల్ పవర్ ప్లాంట్ లో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ ను నిర్నించే యత్నాల్లో ఉంది.

ఒడిశాకు చెందిన గ్రీన్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ రాష్ట్రంలోని జలాశయాలపై వాణిజ్య పరంగా, మొత్తం 500 మెగావాట్ల సామర్ధ్యంతో, దశలవారీగా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మించటానికి NHPC (National Hydroelectric Power Corporation) తో చేతులు కలిపింది.