రూ.2వేల కోట్ల ప్రాజెక్టును అమ్మకానికి పెట్టిన ఎన్టీపీసీ

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 11:06 AM IST
రూ.2వేల కోట్ల ప్రాజెక్టును అమ్మకానికి పెట్టిన ఎన్టీపీసీ

శక్తిని నాశనం చేయలేం.. సృష్టించలేం. ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చగలమంతే. కానీ, ఒకసారి వినియోగించిన శక్తి వనరుని మళ్లీ వాడాలంటే.. ఇలా జరిగితే.. ఏ వేస్టేజ్ ఉండదు. మళ్లీ మళ్లీ అదే వనరుతో ఎన్ని ప్రయోజనాలైనా పొందొచ్చు. ఈ ఆలోచన ఎంత చౌకగా ఉన్నా.. కార్యరూపం దాల్చడానికి మాత్రం భారీగా ఖర్చు అవుతుంది. 

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఈ ప్లాన్‌పై ఆసక్తి చూపిస్తుంది. పీటీసీతో కలిసి గాలిని వనరుగా చేసుకుని లాభాలు గడించాలనే యోచనలో ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఇద్దరు కీలక వ్యక్తులు చర్చలు జరిపారట. 

వారిలో ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. శక్తిని రెన్యూ చేయడం చాలా కష్టమైన పని. కానీ, ఓ సారి అది చేసి చూపిస్తే అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. ఈ ప్రాజెక్టు కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నాం. రూ. 2వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ఎవరు దక్కించుకుంటారో చూడాలి. ఇప్పటికే దీనిపై కేపీఎమ్‌జీ ముందుకొచ్చింది. వారితో పాటు సీఎల్పీ హోల్డింగ్స్ లిమిటెడ్, మాక్కరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ అస్సెట్స్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ వారు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది’ అని వెల్లడించాడు.