Oppo K10 Series : ఫస్ట్ టైం ఇండియాకు 50MP కెమెరాలతో ఒప్పో K10 సిరీస్.. ధర ఎంతంటే?

Oppo K10 Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి ఫస్ట్ K సిరీస్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. అదే.. Oppo K10 Series..

Oppo K10 Series : ఫస్ట్ టైం ఇండియాకు 50MP కెమెరాలతో ఒప్పో K10 సిరీస్.. ధర ఎంతంటే?

Oppo K10 Launched In India With Snapdragon 680, 50 Megapixel Cameras, Prices Start At Rs 14,990

Oppo K10 Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి ఫస్ట్ K సిరీస్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. అదే.. Oppo K10 Series.. 50MP కెమెరాలు, స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. ఫస్ట్ టైం ఇండియా మార్కెట్లో రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్.. వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ఈ Oppo K10 సిరీస్ గత ఏడాది చైనాలో లాంచ్ కాగా.. Oppo K9కి సక్సెసర్. అయితే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ K10 సిరీస్‌లో 5G కనెక్టివిటీతో రాలేదు. అంతకుముందు వెర్షన్ Oppo K9 మాత్రమే 5G కనెక్టవిటీతో వచ్చింది.

Oppo K10 ధర ఎంతంటే? :
Oppo K10 ధర 6GB RAM, 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 14,990, 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 16,990తో వచ్చింది. ఈ ఫోన్ నలుపు, నీలం రంగుల్లో వస్తుంది.

Oppo K10 లాంచ్ ఆఫర్లు :
మార్చి 29న మొదటి సేల్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఒప్పో కంపెనీ లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. SBI క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా EMI పేమెంట్ ఆప్షన్ ద్వారా రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు. మీకు ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే లేదా మీరు బ్యాంక్ EMI పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. Oppo K10 కొనుగోలుపై రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, 3 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.

Oppo K10 Launched In India With Snapdragon 680, 50 Megapixel Cameras, Prices Start At Rs 14,990 (1)

Oppo K10 Launched In India With Snapdragon 680, 50 Megapixel Cameras, Prices Start At Rs 14,990

Oppo K10 స్పెసిఫికేషన్స్ :
Oppo K10 సాధారణ బడ్జెట్ ఫోన్. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల Full HD డిస్‌ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో వచ్చింది. మైక్రో SD కార్డ్‌ ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. మీకు మరింత RAM కావాలంటే 5GB వరకు డైనమిక్ RAM పెంచుకునేందుకు సపోర్టు చేస్తుంది. Oppo K10 Android 11-ఆధారిత ColorOS 11.1తో రన్ అవుతుంది.

ఫోన్ వెనుక భాగంలో.. 50-MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. పోర్ట్రెయిట్‌ ఫొటోల కోసం 2-MP కెమెరా మాక్రోలు, 2-MP కెమెరాను అందించారు. K10లో 16-MP కెమెరా ద్వారా సెల్ఫీలు తీసుకోవచ్చు. Oppo K10లో 5000mAh బ్యాటరీ ఉంది. 33W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఛార్జింగ్ పెడితే గంటలోపు బ్యాటరీ నిండిపోతుంది. ఫోన్‌లో ఛార్జింగ్ డేటాను USB-C పోర్ట్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఆడియో అవుట్‌పుట్ కోసం 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ అమర్చారు. Oppo K10 వాటర్, డెస్ట్ ప్రొటెక్షన్ కోసం IP54 రేటింగ్‌ కలిగి ఉంది.

Read Also : Oppo Reno 7 5G : ఒప్పో రెనో 5G ఫోన్ సేల్.. ఈ రోజు నుంచే.. ఆఫర్లు ఇవే..!