Oppo Pad Air : ఒప్పో ఫస్ట్ ప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) భారత మార్కెట్లో మొట్టమొదటి టాబ్లెట్‌ను లాంచ్ చేయనుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్‌ను జూలై 18న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.

Oppo Pad Air : ఒప్పో ఫస్ట్ ప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Oppo To Launch Its First Ever Tablet

Oppo Pad Air : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) భారత మార్కెట్లో మొట్టమొదటి టాబ్లెట్‌ను లాంచ్ చేయనుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్‌ను జూలై 18న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ టాబ్లెట్ Oppo Reno 8 సిరీస్, Oppo Enco X2తో పాటు లాంచ్ చేయనుంది. Oppo Pad Air Xiaomi Pad 5, Moto Tab G70, ఇతర వాటితో రిలీజ్ చేయనుంది. Oppo Pad Air 6GB RAMతో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2000 x 1200 పిక్సెల్ రిజల్యూషన్‌తో 10.36-అంగుళాల 2K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. గతంలో Oppo చైనాలో టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. Oppo Pad Air ధర చైనాలో CNY 1,299గా ఉంది. చైనాలో బేస్ 64GB స్టోరేజ్ వేరియంట్ దాదాపు రూ. 15,100గా ఉంది. భారత మార్కెట్లో Oppo బడ్జెట్ వేరియంట్‌ను మాత్రమే లాంచ్ చేయాలని భావిస్తోంది. ఇప్పుడు లాంచ్ చేసిన ఒప్పో ప్యాడ్ ఎయిర్ స్పెసిఫికేషన్లు ఏంటో ఓసారి చూద్దాం..

ఒప్పో ప్యాడ్ ఎయిర్ స్పెసిఫికేషన్స్ :
Oppo Pad Air 2000 x 1200 pixes రిజల్యూషన్‌తో 10.36-అంగుళాల 2k డిస్‌ప్లేతో రానుంది. టాబ్లెట్ గరిష్టంగా 6GB RAMతో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ కలిగి ఉంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 12లో కంపెనీ సొంత లేయర్ ColorOS 12తో రన్ అవుతుంది. Oppo ప్యాడ్ ఎయిర్ 64GB, 128GBతో సహా రెండు స్టోరేజీ ఆప్షన్లలో రానుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్‌ కూడా అందిస్తోంది. తద్వారా యూజర్లు తమ స్టోరేజీని విస్తరించుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. ఒప్పో ప్యాడ్ ఎయిర్ f/2.0 అపర్చర్‌తో ఒకే 8MP సింగిల్-లెన్స్‌ని కలిగి ఉంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది.

Oppo To Launch Its First Ever Tablet (1)

Oppo To Launch Its First Ever Tablet 

ఒప్పో ప్యాడ్ ఎయిర్‌లో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో క్వాడ్ స్పీకర్‌లు ఉన్నాయి. టాబ్లెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7100mAh బ్యాటరీని కలిగి ఉంది. Oppo ప్యాడ్ ఎయిర్ స్మార్ట్ స్టైలస్, మాగ్నెటిక్ కీబోర్డ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కంపెనీ ఈ రెండు యాక్సెసరీలను భారత మార్కెట్లో విడివిడిగా విక్రయించాలని భావిస్తున్నారు. భారత మార్కెట్లో అదే విధంగా ప్రారంభించాలని భావిస్తున్నారు. Oppo ప్యాడ్ ఎయిర్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్ స్టైలస్ కేవలం 18 గ్రాముల బరువు, 650mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. స్టైలస్ 4096-స్థాయి ప్రెజర్ సెన్సిటివిటీకి సపోర్టుతో వస్తుంది. Oppo ప్యాడ్ ఎయిర్ బ్లూటూత్ 5.0తో వచ్చే మాగ్నెటిక్ కీబోర్డ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : Oppo Reno 8 5G : ఒప్పో రెనో 8 5G ఫోన్లు.. లాంచ్‌కు ముందే లీక్.. ధర ఎంతో తెలిసిందోచ్..!