PAN-Aadhaar: పాన్‌కార్డ్-ఆధార్ లింక్‌కు నేడే చివరి రోజు.. లేకుంటే వెయ్యి జరిమానా

పాన్‌కార్డుతో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలని కేంద్రం ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. దీనికి ఈ ఏడాది మార్చి 31 తుది గడువుగా నిర్ణయించింది. ఆ టైమ్ దాటి పోవడంతో రూ.500 ఫైన్‌తో ఆధార్ లింక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.

PAN-Aadhaar: పాన్‌కార్డ్-ఆధార్ లింక్‌కు నేడే చివరి రోజు.. లేకుంటే వెయ్యి జరిమానా

Pan Aadhaar

PAN-Aadhaar: మీ పాన్‌కార్డుతో ఆధార్ కార్డ్ లింక్ చేసుకున్నారా? అయితే సరే! లేదంటే వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సిందే. ఎందుకంటే పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు జూన్ 30 చివరి రోజు. అది కూడా రూ.500 ఫైన్‌తో. లేదంటే రేపటి (జూలై 1) నుంచి ఫైన్ వెయ్యి రూపాయలు అవుతుంది. పాన్‌కార్డుతో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలని కేంద్రం ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. దీనికి ఈ ఏడాది మార్చి 31 తుది గడువుగా నిర్ణయించింది. ఆ టైమ్ దాటి పోవడంతో రూ.500 ఫైన్‌తో ఆధార్ లింక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. అది కూడా జూన్ 30 వరకే.

Amarnath Yatra: నేటి నుంచే అమర్‌నాథ్ యాత్ర.. రెండేళ్ల తర్వాత ప్రారంభం

ఈ గడువు కూడా నేటితో పూర్తవుతుంది. ఈ రోజు పాన్-ఆధార్ లింక్ చేసుకోకపోతే, రేపటి నుంచి వెయ్యి రూపాయల ఫైన్ చెల్లించాలి. ముందుగా రూ.500 ఫైన్ చెల్లిస్తే, ఆ తర్వాత నాలుగైదు రోజుల వరకు ఆధార్-పాన్ లింక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనికోసం ఆన్‌లైన్ సెంటర్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరైనా ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి, ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. సొంతంగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోలేని వాళ్లు పాన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లవచ్చు.