Amarnath Yatra: నేటి నుంచే అమర్‌నాథ్ యాత్ర.. రెండేళ్ల తర్వాత ప్రారంభం

జమ్ము-కాశ్మీర్, నున్వాన్ బేస్ క్యాంపు నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు అమర్‌నాథ్ బయలుదేరారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ పీయూష్ సింగ్లా జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. తీవ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈసారి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Amarnath Yatra: నేటి నుంచే అమర్‌నాథ్ యాత్ర.. రెండేళ్ల తర్వాత ప్రారంభం

Amarnath Yatra

Amarnath Yatra: హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్రల్లో ఒకటైన అమర్‌నాథ్ యాత్ర గురువారం ప్రారంభమైంది. జమ్ము-కాశ్మీర్, అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో ఉన్న నున్వాన్ బేస్ క్యాంపు నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు అమర్‌నాథ్ బయలుదేరారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ పీయూష్ సింగ్లా జెండా ఊపి యాత్ర ప్రారంభించారు.

TS 10th Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు విడుదల

ఈ సందర్భంగా స్థానికులు, అధికారులు భక్తులకు ఘన స్వాగతం పలికారు. అమర్‌నాథ్ చేరేందుకు పహల్గాంతోపాటు, బల్తాల్ అనే మరో మార్గం కూడా ఉంది. తీవ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈసారి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు, స్థానిక పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. పూర్తి భద్రత మధ్య, ప్రశాంతంగా యాత్ర సాగేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్లతోపాటు ఆధునిక సాంకేతికతను భద్రత కోసం వినియోగిస్తున్నారు. యాత్రికులకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ యాత్ర 43 రోజులపాటు సాగుతుంది. అంటే ఆగష్టు 11, రక్షాబంధన్ రోజున యాత్ర ముగుస్తుంది.

Telangana Food: బీజేపీ సభకోసం తెలంగాణ రుచులు.. స్పెషల్ ఐటమ్స్ చేయనున్న యాదమ్మ

మొదటి బ్యాచులో 4,890 మంది యాత్రికులు అమర్‌నాథ్ వెళ్తున్నారు. ఈ పవిత్ర ప్రదేశం సముద్ర మట్టానికి 3,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ మంచుతో ఏర్పడిన శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. కరోనా వల్ల 2020, 2021లో యాత్ర సాగలేదు. రెండేళ్ల తర్వాత యాత్ర ప్రారంభమవడం విశేషం. అంతకుముందు అంటే 2019లో ఆర్టికల్ 370పై జరిగిన అల్లర్ల నేపథ్యంలో కూడా యాత్రపై పలు ఆంక్షలు విధించారు.