చెక్ చేశారా? :  Paytmలో క్రెడిట్ స్కోరు ఫీచర్ 

క్రెడిట్ స్కోరు అనుసరించే సదరు అకౌంట్ దారుడికి క్రెడిట్ కార్డు అప్రూవల్, లోన్స్ బెనిఫెట్స్ ఇస్తుంటాయి ఫైనాన్షియల్ సంస్థలు.

  • Published By: sreehari ,Published On : April 23, 2019 / 10:09 AM IST
చెక్ చేశారా? :  Paytmలో క్రెడిట్ స్కోరు ఫీచర్ 

క్రెడిట్ స్కోరు అనుసరించే సదరు అకౌంట్ దారుడికి క్రెడిట్ కార్డు అప్రూవల్, లోన్స్ బెనిఫెట్స్ ఇస్తుంటాయి ఫైనాన్షియల్ సంస్థలు.

మీ క్రెడిట్ స్కోరు ఎంతో తెలుసా? మీరు వాడుతున్న డెబిట్, క్రెడిట్, పేటీఎం కార్డులపై ఎంత క్రెడిట్ స్కోరు ఉందో ఎప్పుడైనా చెక్ చేశారా? బ్యాంకుల నుంచి అధిక ప్రయోజనాలు పొందాలంటే ప్రధానంగా క్రెడిట్ స్కోరు ఎంతో అవసరం. క్రెడిట్ స్కోరు అనుసరించే సదరు అకౌంట్ దారుడికి క్రెడిట్ కార్డు అప్రూవల్, లోన్స్ బెనిఫెట్స్ ఇస్తుంటాయి ఫైనాన్షియల్ సంస్థలు. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం మొబైల్ యాప్ లో క్రెడిట్ స్కోరు చెక్ చేసేందుకు కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. ‘మై క్రెడిట్ స్కోరు’. ఈ ఫీచర్ ద్వారా మీ క్రెడిట్ స్కోరు ఎంత ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. యూజర్ ప్రొఫైల్ సెక్షన్ కింద మై క్రెడిట్ స్కోరు ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు.. ఈ సర్వీసును యూజర్లు యాక్సస్ చేసుకోవచ్చు.
Also Read : మీరు రెడీనా? : పెరగనున్న జియో టారిఫ్ ధరలు?

యూజర్లు తమ ఈమెయిల్స్ ద్వారా పూర్తి వివరాలతో కూడిన క్రెడిట్ రిపోర్ట్ ను పొందవచ్చు. ఎంతకాలంగా క్రెడిట్ అకౌంట్లు వాడుతున్నారు.. క్రెడిట్ వాడకం, రీపేమెంట్ హిస్టరీ ఆధారంగా పూర్తి క్రెడిట్ సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా పొందవచ్చు. ఈ క్రెడిట్ స్కోరు ఆధారంగానే బ్యాంకు లోన్లు అప్రూవల్, క్రెడిట్ కార్డు అప్రూవల్ అయ్యేందుకు.. కీ మెట్రిక్ గా పనిచేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తున్న పేటీఎంకు ఇదొక వ్యూహాత్మక అడుగు. కస్టమర్లకు మల్టీ సర్వీసులను అందించేందుకు పేటీఎం కేంద్రీకృతంగా మారుతోంది.

మంచి క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు ఈ సర్వీసు ఎంతో ఉపకరిస్తుంది’ అని సీనియర్ ఎనలిస్ట్ పావెల్ నాయా తెలిపారు. యూజర్లకు సంబంధించిన అన్ని క్రెడిట్ కార్డుల సమాచారంతో పాటు లోన్లు అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని స్నాప్ షాట్ రూపంలో పొందవచ్చు. వీటిపై ఎంతవరకు క్రెడిట్ స్కోరు ఉందో తెలుసుకోవచ్చు. యూజర్ల క్రెడిట్ స్కోరు ఆధారంగా పేటీఎం పోస్టు పెయిడ్ పై నెలకు రూ.30వేల వరకు క్రెడిట్ పొందవచ్చు. మార్చి 2017లో ఫైనాన్షియల్ సర్వీసెస్ సబ్ సైడరీ పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసులను కంపెనీ ప్రవేశపెట్టింది.

యూజర్లకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ ,మ్యూటవల్ ఫండ్స్ వంటి వివిధ సర్వీసులను అందిస్తోంది. పేటీఎం 2017 నవంబర్ లో ICICI బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా యూజర్లకు 45రోజుల వ్యవధిలో రూ.3వేలు నుంచి రూ.20వేల వరకు క్రెడిట్ చేస్తే ఇంట్రెస్ట్ ఫ్రీ ఆఫర్ చేస్తోంది. బిల్ పేమెంట్స్, మూవీ టికెట్లు, ఫ్లయిట్ బుకింగ్ వంటి పేమెంట్స్ చేసిన వారికి పేటీఎం ఈ ఆఫర్ అందిస్తోంది. 
Also Read : మీ ఆధార్ కార్డు పోయిందా? : e-Aadhaar డౌన్ లోడ్ చేసుకోండిలా

క్రెడిట్ స్కోరు చెక్ చేసుకోవాలంటే :
* మీ పేటీఎం మొబైల్ యాప్ లో లాగిన్ అవ్వండి.
* యూజర్ నేవిగేషన్ పై క్లిక్ చేయండి. 
* యూజర్ ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేయండి.
* మై క్రెడిట్ స్కోరు (న్యూ) అనే ఫీచర్ పై క్లిక్ చేయండి. 
* చెక్ Your క్రెడిట్ స్కోరు అనే ఆప్షన్ కనిపిస్తుంది. 
* మీ వ్యక్తిగత వివరాలు, పేరు (last name)ఎంటర్ చేయండి.
* మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ డిఫాల్ట్ ఆప్షన్ ఉంటుంది.
* క్రెడిట్ స్కోరు చెక్ చేసుకునేందుకు ధ్రువీకరణ కోసం (టిక్ మార్క్) చెక్ చేయండి.
* Proceed బటన్ పై క్లిక్ చేస్తే చాలు.. మీ క్రెడిట్ స్కోరు సమాచారం వెంటనే తెలుసుకోవచ్చు.