Poco X4 Pro 5G : పోకో నుంచి మిడ్‌ రేంజ్ 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

Poco X4 Pro 5G Phone : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి సరికొత్త మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి Poco X4 Pro సిరీస్ 5G సపోర్టుతో వచ్చింది.

Poco X4 Pro 5G : పోకో నుంచి మిడ్‌ రేంజ్ 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

Poco X4 Pro 5g With Snapdragon 695 Soc Launched, Price Starts At Rs 18,999

Poco X4 Pro 5G Phone : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి సరికొత్త మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి Poco X4 Pro సిరీస్ 5G సపోర్టుతో వచ్చింది. స్నాప్ డ్రాగన్ 695SoC ప్రాసెసర్‌తో పాటు 108MP భారీ కెమెరా ఫీచర్లతో వచ్చింది. గత ఏడాదిలో పోకో సిరీస్ X3 Proకు ఇది అడ్వాన్స్‌డ్ వెర్షన్. Poco X4 Pro 5G ఈ ఏడాది ప్రారంభంలో స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లేదా MWC 2022లో ఆవిష్కరించింది. ఈ నెల ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అయిన Redmi Note 11 Pro+ 5G రీబ్యాడ్జ్ వెర్షన్ అంటున్నారు. ఈ కొత్త Poco ఫోన్ డిజైన్‌లో కొన్ని మార్పులతో రిలీజ్ చేసింది. Poco ఫోన్ Redmi డివైజ్ 108-MP ప్రైమరీ సెన్సార్‌కు బదులుగా 64-MP ప్రైమరీ కెమెరాతో వస్తోంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌లో మిగిలిన ఫీచర్లు గ్లోబల్ వేరియంట్ మాదిరిగా యూజర్లను ఆకర్షించేలా ఉన్నాయి. భారత మార్కెట్లో Poco X4 Pro 5G ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Poco X4 Pro 5G ధర (6GB RAM + 64GB స్టోరేజ్) వేరియంట్ రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999గా ఉండనుంది. అలాగే 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. రూ.21,999గా ఉండనుంది. పోకో x4pro ఫోన్ నలుపు, నీలం, పసుపు రంగులలో వస్తోంది. ఈ ఫోన్ ఏప్రిల్ 5, 2022 నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ లో అందుబాటులోకి రానుంది. మీ పాత X సిరీస్ ఫోన్‌లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా Poco అదనంగా రూ. 3,000 డిస్కౌంట్ అందిస్తోంది. HDFC Bank డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై రూ.1,000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

Poco X4 Pro 5g With Snapdragon 695 Soc Launched, Price Starts At Rs 18,999 (1)

Poco X4 Pro 5g With Snapdragon 695 Soc Launched, Price Starts At Rs 18,999 

Poco X4 Pro 5G : ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఇవే :
Poco X4 Pro 5G FULL HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల హోల్-పంచ్ AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. డిస్‌ప్లే 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే స్పెక్స్ రెడ్‌మి నోట్ 11 ప్రో+ 5G మాదిరిగానే ఉంటాయి. ఈ ఫోన్ గరిష్టంగా 8GB RAMతో Qualcomm Snapdragon 695 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. గత ఏడాదిలో Poco X3 Pro Snapdragon 860 SoCని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకించి గేమింగ్‌ సపోర్టు చేస్తుంది. కానీ, దీనికి 5G సపోర్టు లేదు. Poco X4 Pro 5G మైక్రో SD కార్డ్ సపోర్ట్‌తో వస్తుంది. దీనికి హైబ్రిడ్ స్లాట్ కూడా ఉంది.

64-MP ప్రైమరీ కెమెరా, 8-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2-MP మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఫోన్ ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ గ్లోబల్ వేరియంట్ 108-MP ప్రైమరీ సెన్సార్‌ను అమర్చారు. ఈ కొత్త Poco ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ వేరియంట్ నలుపు, నీలం పసుపు అనే మూడు కలర్ల ఆప్షన్లలో వస్తోంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వచ్చింది.

Read Also : WhatsApp iPhone Users : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఐఫోన్ యూజర్లు త్వరలో 2GB వరకు ఫైల్స్ పంపుకోవచ్చు!