భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఆయిల్ కంపెనీలు వాహనదారులకు శుభవార్త అందించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.

  • Edited By: veegamteam , March 11, 2020 / 04:28 AM IST
భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఆయిల్ కంపెనీలు వాహనదారులకు శుభవార్త అందించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.

ఆయిల్ కంపెనీలు వాహనదారులకు శుభవార్త అందించాయి. లీటర్ పెట్రోల్ పై రూ.2.69, డీజిల్ పై రూ.2.33 తగ్గాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ భారం తగ్గినట్లయ్యింది. పెట్రోలియం సరఫరా చేసే దేశాల మధ్య ధరల పోటీ తీవ్రతరం కావడంతో గ్లోబల్ మార్కెట్‌లో పెట్రో ధరలు భారీగా పతనమయ్యాయి. 

1991 గల్ఫ్ యుద్ధం తర్వాత పెట్రో ధరలు తగ్గాయి. ఇదే కాదు మరో 15 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఏప్రిల్ 1 నుంచి మాత్రం జీఎస్ 6 నిబంధనల వల్ల మాత్రం ధరలు పెరిగే అవకాశం ఉంది.

హోలీ తర్వాత ప్రజలకు సంతోషం కలిగించే వార్తను ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినట్టు పేర్కొన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.29కు చేరింది. పెట్రోల్‌పై రూ.2.69 తగ్గగా.. డీజిల్‌పై రూ.2.33 తగ్గింది. లీటర్ డీజిల్ రూ.63.01కి చేరింది. మంగళవారం (మార్చి 10, 2020) ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.98కి విక్రయించగా.. డీజిల్ రూ.65.34కి విక్రయించారు.

సోమవారం (మార్చి 9, 2020) పెట్రోల్, డీజిల్ ధరలు రూ.71 మార్క్ చేరాయి. 8 నెలల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.70.59కి చేరింది. ఇది 2019 జూలై తర్వాత కనిష్ట ధరకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులతో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పెట్రో ఉత్పత్తలు ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
 

See Also | దయ్యాన్ని వదిలిస్తానని రూ.6 లక్షలు తీసుకున్న బాబా ఏమయ్యాడు ?