Reliance Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్‌ ఫేజ్‌ ట్రయల్స్‌కు లైన్ క్లియర్!

అపర కుబేరుడు ముకేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌.. కరోనా వ్యాక్సిన్‌ తయారీలోకి ఎంట్రీ ఇచ్చింది. రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఈ కరోనా టీకాను డెవలప్ చేసింది.

Reliance Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్‌ ఫేజ్‌ ట్రయల్స్‌కు లైన్ క్లియర్!

Reliance Gets Nod To Start Covid 19 Vaccine Trials

Reliance Covid-19 vaccine trials : అపర కుబేరుడు ముకేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌.. కరోనా వ్యాక్సిన్‌ తయారీలోకి ఎంట్రీ ఇచ్చింది. రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ Reliance Life Sciences (RLS) డెవలప్ చేసిన రీకాంబినెంట్‌ ఆధారిత వ్యాక్సిన్‌‌కు లైన్ క్లియర్ అయింది. రెగ్యులేటరీ అనుమతులకు అప్లయ్ చేసుకోగా వ్యాక్సిన్ ట్రయల్స్‌ ది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రిలయన్స్ వ్యాక్సిన్ హ్యూమన్‌ ట్రయల్స్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్టే.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్ రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఈ వ్యాక్సిన్‌ డెవలప్ చేసింది. అతి త్వరలో ఫేజ్‌-1 ట్రయల్స్‌ను ప్రారంభించనుంది.

ఫస్ట్‌ ఫేజ్‌ ట్రయల్స్‌ ముంబై ధీరూబాయ్‌ అంబానీ లైఫ్‌ సైన్సెస్‌ సెంటర్‌లో 58 రోజులపాటు నిర్వహించనుంది. ఇది పూర్తి అయ్యాక రెండో దశ ట్రయల్స్, ఆ వెంటనే మూడో ట్రయల్స్‌ కూడా నిర్వహించనుంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. ఈ రెండో డోసుల వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది 2022 మొదటి త్రైమాసికంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫేస్-1 ట్రయల్స్ మొదటిసారి చిన్న గ్రూపు వాలంటీర్లలో పరీక్షించింది. సాధారణంగా వీరి వయస్సు 20ఏళ్ల నుంచి 80ఏళ్ల మధ్య ఉంటుంది. వీరిలో ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఎలా ఉంటుందనేదానిపై తర్వాతి పరిశోధనలు జరుగనున్నాయి.
India Covid-19 : కరోనా కల్లోలం.. నిన్న వైరస్ సోకిన వాళ్లలో 50 శాతం మంది తొలి డోసు తీసుకున్నవాళ్లే!

ఇప్పటికే ల్యాబరేటరీ యానిమల్ రీసెర్చ్ ఫెసిలిటీలో ప్రీ-క్లినికల్ ట్రయల్స్ జంతువులపై జరిగాయి. అదే కంపెనీ భాగస్వామ్యంలో హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీకి సంబంధించినది. క్రిటికల్ కేర్ పేషెంట్లకు అవసరమయ్యే ప్రొడక్టులను ఈ కంపెనీ తయారు చేస్తుంది. బయోసిమిలర్ ప్రొడక్టులు, ప్లాస్మా ప్రోటీన్లు, కాంప్లెక్స్ మోనోక్లోనల్ యాంటీబాడీలను తయారుచేస్తోంది. వచ్చే ఏడాదిలో కొవిడ్ టీకాలను కూడా తయారుచేయనుంది. మనదేశంలో ప్రస్తుతం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, క్యాడిల్లా వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ట్రయల్స్ ఫలితాలు వస్తే.. 2022 ఏడాదిలో రిలయన్స్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావచ్చు.