ఈ సోషల్ ఫేక్ అకౌంట్లను నమ్మొద్దు : ఖాతాదారులకు SBI వార్నింగ్

భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.

  • Published By: sreehari ,Published On : September 24, 2019 / 09:30 AM IST
ఈ సోషల్ ఫేక్ అకౌంట్లను నమ్మొద్దు : ఖాతాదారులకు SBI వార్నింగ్

భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.

భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లతో సైబర్ నేరగాళ్లు ఖాతాదారులను మోసగించే అవకాశం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. బ్యాంకు అధికారిక అకౌంట్ల మాదిరిగా నమ్మించి వేలాది మంది కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు.

ఒక ఎస్బీఐకి మాత్రమే పరిమితం కాదు.. అన్ని ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి కస్టమర్లను మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిస్తోంది. సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లకు దూరంగా ఉండాలని కస్టమర్లను ఎస్బీఐ సూచిస్తోంది. ఎస్బీఐకి సంబంధించిన అధికారిక సోషల్ అకౌంట్లను మాత్రమే ఫాలో అవ్వాలని సూచించింది.

సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కస్టమర్లను మాయ చేస్తుంటారని ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. వెరిఫై చేసిన అకౌంట్ లేదా ఫేక్ అకౌంట్ నిర్ధారించుకోవాలన్నారు. సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లపై ఎక్కువ సమయం గడపడం లేదా డబ్బులతో లావాదేవీలు చేయొద్దని సూచించింది.

ఫాలో ట్యాగ్ విషయంలో SBI వెరిఫై అయిన అకౌంట్లతోనే కనెక్ట్ అవ్వండి, కామెంట్లు, ఫిర్యాదులు, విచారణ వంటి విషయాల్లో కస్టమర్లు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి వాటితో నమ్మించే ప్రయత్నం చేస్తుంటారని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా హెచ్చరిస్తోంది.

1. ఫేక్ అకౌంట్.. తెలుసుకోవడం ఎలా?
* బ్యాంకు అకౌంట్ పేరు ముందు వెరిఫైడ్ సైన్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
* అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో ఈ వెరిఫైడ్ ఫీచర్ ద్వారా అధికారిక అకౌంట్ కాదా లేదో చెక్ చేసుకోవచ్చు.
* ప్రస్తుతం.. ఎస్బీఐ సోషల్ మీడియా అకౌంట్లు.. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, లింక్డిన్, పిన్‌ రెస్ట్, యూట్యూబ్, క్వారా అకౌంట్లు ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది.

2. మీ అకౌంట్ సేఫ్.. టిప్స్ ఇవే :
* ఎవరైనా మీకు ఫోన్ కాల్ చేసి బ్యాంకు అకౌంట్ వివరాలు అడిగితే చెప్పొద్దు.
* డెబిట్ నెంబర్, CVV, ఎక్స్ పెయిరీ డేట్, OTP, PIN లేదా అనుమానాస్పద యాప్స్ లేదా లింక్స్ ఓపెన్ చేయొద్దు.
* మీకు ఫోన్ కాల్ చేసి అడిగే వారు ఎందుకు.. ఏ విషయంలో వివరాలు అడుగుతున్నారో గమనించండి.
* ఎలాంటి మోసానికి ప్రయత్నించినట్టు అనుమానం వచ్చినా వెంటనే రిపోర్టు చేయండి.
* మీ వ్యక్తిగత వివరాలను ఎవరికి షేర్ చేయొద్దు. బ్యాంకు అధికారులు ఎప్పుడూ వ్యక్తిగత వివరాలను అడగరు.