Sensex: యుద్ధం దెబ్బ నుంచి కోలుకున్న భారత స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ నిన్నటి తీవ్ర పతనం నుంచి కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Sensex: యుద్ధం దెబ్బ నుంచి కోలుకున్న భారత స్టాక్ మార్కెట్లు

Ukrain Stock

Sensex: దేశీయ స్టాక్ మార్కెట్ నిన్నటి తీవ్ర పతనం నుంచి కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్దం భారత స్టాక్ మార్కెట్‌లను గట్టి దెబ్బ కొట్టగా.. స్టాక్ మార్కెట్ నిన్న సుమారు 2800 పాయింట్ల విపరీతమైన పతనంతో ముగిసింది. నిఫ్టీలో 842 పాయింట్ల బలమైన క్షీణత కనిపించింది. అయితే ఈరోజు స్టాక్‌ మార్కెట్‌కు సపోర్ట్ లభించడంతో స్వల్ప లాభాల్లో కనిపిస్తుంది.

ఈరోజు స్టాక్ మార్కెట్‌లో 876 పాయింట్ల జంప్‌తో సెన్సెక్స్ 55321 స్థాయి వద్ద ప్రారంభమైంది. NSE నిఫ్టీ 297 పాయింట్ల జంప్‌తో 16515 స్థాయి వద్ద స్టార్ట్ అయ్యింది. వ్యాపారం స్థిరమైన వేగంతో కనిపిస్తుండగా.. మంచి సెంటిమెంట్ల కారణంగా మార్కెట్‌కు సపోర్ట్ లభిస్తుంది. 50 నిఫ్టీ స్టాక్‌లలో 47 గ్రీన్ మార్క్‌తో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి జంప్‌ను నమోదు చేస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 817 పాయింట్లు ఎగబాకి 2.32 శాతానికి పెరిగింది. ఇందులో 36వేల 45 స్థాయిలో ట్రేడ్ జరుగుతోంది.

నిన్న 10 శాతం క్షీణించి నిఫ్టీ టాప్ లూజర్‌గా నిలిచిన స్టాక్ మార్కెట్ టాప్ గెయినర్స్ టాటా మోటార్స్ నేడు టాప్ గెయినర్‌గా 5.82 శాతం జంప్‌ను చూస్తోంది. యూపీఎల్ 4.62 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 4.41 శాతం పెరిగాయి. టాటా స్టీల్ 3.68 శాతం, అదానీ పోర్ట్స్ 3.37 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.

ఈరోజు స్టాక్ మార్కెట్‌లో టాప్ లూజర్స్:
బ్రిటానియా ఇండస్ట్రీస్ 1.45 శాతం పడిపోగా.. సిప్లా 0.16 శాతం నష్టాలను చూస్తోంది. నెస్లేలో 0.15 శాతం బలహీనత కనిపిస్తోంది.

ఈరోజు ప్రీ ఓపెనింగ్ మార్కెట్‌లో..
స్టాక్ మార్కెట్ నిన్నటి స్థాయి నుంచి రికవర్ అవుతోంది. సెన్సెక్స్‌లో 1.45 శాతం అంటే 791 పాయింట్ల జంప్ తర్వాత, వ్యాపారం 55,321 వద్ద కనిపిస్తోంది. నిఫ్టీ 16,500 ఎగువన ప్రారంభానికి సిద్ధమవుతోంది.

SGX నిఫ్టీ కూడా.. నేటి ట్రేడింగ్‌లో మార్కెట్ ప్రారంభం కాకముందే, SGX నిఫ్టీ బూమ్‌తో ట్రేడవుతోంది. ఈరోజు SGX నిఫ్టీ స్థాయిలు నిన్నటి పతనం కంటే దాదాపు 300 పాయింట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నిన్నటి మార్కెట్..
నిన్నటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2788 పాయింట్ల పతనంతో 54,445 వద్ద.. నిఫ్టీ 842 పాయింట్ల నష్టంతో 16,218 పాయింట్ల వద్ద ముగిసింది.