Svitch Electric Bike : హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ స్విచ్ బైక్ నుంచి కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్..!

Svitch Electric Bike : ప్రముఖ టూ వీలర్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ స్విచ్ బైక్ నుంచి కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియెన్స్ షోరూమ్ ప్రారంభమైంది. MV ఆటోమొబైల్స్ స్విచ్ బైక్ ఎక్స్‌క్లూజివ్ డీలర్‌షిప్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.

Svitch Electric Bike : హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ స్విచ్ బైక్ నుంచి కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్..!

Svitch Bike launches experience centre in Hyderabad

Svitch Electric Bike : అహ్మదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్విచ్ బైక్ (Svitch Bike) నుంచి కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రీమియం ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ ఇండస్ట్రీలో టాప్ ప్లేసులో నిలిచిన MV ఆటోమొబైల్స్ స్విచ్ బైక్ ఎక్స్‌క్లూజివ్ డీలర్‌షిప్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైదరాబాద్, IT హబ్‌ కావడంతో వినియోగదారులు ఎంచుకోవడానికి 300+ కన్నా ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్‌లు & మల్టీ బ్రాండ్‌ల సాధికారికతను పొందుతున్నారు.

హైదరాబాద్‌లో ఆనంద్ థియేటర్, మోచి షోరూమ్, బేగంపేట్ రోడ్‌లో ఈ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఉంది. డైమండ్ & జ్యువెలరీ పరిశ్రమలో సత్తా చాటిన మహేష్ & సాయి వినీత్ నాలం రోహిత్ ఎంవీ ఆటోమొబైల్స్‌ సెంటర్‌కు సారథ్యం వహించనున్నారు. ఈవీ ఇండస్ట్రీలోని వివిధ సెక్టార్లలోని మల్టీ కంపెనీలకు మార్కెట్ ఓపెన్ కావడం, కస్టమర్లు కూడా ఆసక్తి చూపడంతో హైదరాబాద్‌లోని ఈవీ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది.

Read Also : Google Pixel 7a Price : గూగుల్ పిక్సెల్ 7a ధర ఎంతో తెలిసిందోచ్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. Pixel 6a కన్నా ఖరీదైనదేనా?

ఈ కొత్త ఎక్స్‌ పీరియన్స్ సెంటర్ ఇజియా బ్రాండింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సాయంతో నిర్వహిస్తోంది. స్విచ్ బైక్ & స్విచ్ మోటోకార్ప్ వ్యవస్థాపకుడు ఎండీ రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ.. షోరూమ్‌లో స్విచ్ బైక్‌తో పాటు వినియోగదారుల కోసం CSR762 ను ప్రదర్శిస్తామన్నారు. హైదరాబాద్ మెట్రోసిటీ కావడంతో ఇప్పటికే విస్తారమైన EV మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు.

Svitch Bike launches experience centre in Hyderabad

Svitch Bike launches experience centre in Hyderabad

దాంతో EV పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. భారత్ & విదేశాలలో పైప్‌లైన్‌లో ఈ ఎక్స్‌పీరియన్స్ షోరూమ్‌లను చాలా కలిగి ఉందన్నారు. స్విచ్ బైక్ & స్విచ్ మోటార్‌కార్ప్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు చింతన్ ఖత్రీ మాట్లాడుతూ.. ‘స్విచ్ ఎలక్ట్రిక్ సైకిల్స్‌తో ప్రీమియం సెగ్మెంట్‌ను అందించాం. మార్కెట్లో (CSR762)తో ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌లకు కార్యకలాపాలను వైవిధ్యపరిచాం. ఐటీ హబ్ మొదలైనవాటి నుంచి హైదరాబాద్ మొత్తం EV పర్యావరణ వ్యవస్థకు సేవలు అందిస్తున్నాం’ అని ఆయన అన్నారు.

భారత మార్కెట్లో, విదేశాలలో ఈ ఎక్స్‌‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామన్నామని తెలిపారు. (CSR762) EV మోటార్‌బైక్‌కు మాతృ సంస్థ స్విచ్ మోటోకార్ప్ సల్మాన్ యూసఫ్ ఖాన్‌ అధికారిక ప్రచారకర్తగా సమ్మర్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది. హైదరాబాద్‌లో స్విచ్ ఎలక్ట్రిక్ సైకిల్స్ CSR762 ద్వారా సమీపంలోని ప్రత్యేక డీలర్ ఎంవీ ఆటోమొబైల్స్ అందరికి అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ & దక్షిణ మార్కెట్‌లోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేకమైన ఎక్స్ పీరియెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని స్విచ్ బైక్ భావించింది. అందులో భాగంగానే ప్రీమియం ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తోంది.

Read Also : KTM 390 Adventure X : రూ. 2.8 లక్షలకే భారత్‌లోకి KTM 390 అడ్వెంచర్ X వచ్చేసింది..!