Tata UPI App : గూగుల్‌ పే, ఫోన్‌పేకు పోటీగా.. టాటా యూపీఐ యాప్ వచ్చేస్తోంది..!

Tata UPI App : ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా గ్రూపు కంపెనీ త్వరలో కొత్త టాటా యూపీఐ పేమెంట్ యాప్ తీసుకొస్తోంది. ఈ కొత్త యూపీఐ యాప్ ద్వారా అన్ని రకాల ఆన్‌లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు.

Tata UPI App : గూగుల్‌ పే, ఫోన్‌పేకు పోటీగా.. టాటా యూపీఐ యాప్ వచ్చేస్తోంది..!

Tata Upi Tata Group To Join Upi Payments Club Through A New App Report

Tata UPI App : ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా గ్రూపు కంపెనీ త్వరలో కొత్త టాటా యూపీఐ పేమెంట్ యాప్ తీసుకొస్తోంది. ఈ కొత్త యూపీఐ యాప్ ద్వారా అన్ని రకాల ఆన్‌లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఆన్ లైన్ డిజిటల్ పేమెంట్స్‌లో గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe), పేటీఎం (Paytm)లకు పోటీగా Tata UPI App రాబోతోంది. ఓ నివేదిక ప్రకారం.. భారత అతిపెద్ద ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూప్ సాల్ట్ బిజినెస్ నుంచి టాటా స్టీల్ వరకు అనేక రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతోంది.

అయితే ఇప్పుడు ఆన్‌‌లైన్ డిజిటల్ పేమెంట్స్ సర్వీసు ప్రొవైడర్ కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. థర్డ్-పార్టీ పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్‌ను ప్రారంభించే ముందు కంపెనీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) నుంచి క్లియరెన్స్ కోరుతున్నట్లు నివేదిక పేర్కొంది. టాటా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ పేమెంట్స్ కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ఉపయోగించనుంది. UPI యాప్ టాటా గ్రూప్ డిజిటల్ కామర్స్ యూనిట్ టాటా డిజిటల్ కింద పనిచేయనుంది.

దీనిద్వారానే UPI సిస్టమ్‌ను డెవలప్ చేసేందుకు ICICI బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. అన్‌వర్స్డ్, నాన్-బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల్లో కూడా UPI సదుపాయాన్ని అందించేందుకు బ్యాంక్‌తో భాగస్వామిగా ఉండనుంది. UPI యాప్ ద్వారా పేమెంట్స్ చేయాలంటే చాలా కంపెనీలు మరిన్ని బ్యాంకులతో టై-అప్ అవుతుంటాయి.

Tata Upi Tata Group To Join Upi Payments Club Through A New App Report (1)

Tata Upi Tata Group To Join Upi Payments Club Through A New App Report

Google Pay నివేదిక ప్రకారం.. దాని అధిక లావాదేవీల భారాన్ని పంచుకోవడానికి SBI, HDFC, ICICI బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. భారత మార్కెట్లో ఎక్కువ శాతం UPI లావాదేవీలు Google Pay లేదా PhonePeలోనే ఎక్కువగా జరుగుతున్నాయి.Paytm, Amazon Pay, WhatsApp pay వంటి ఇతర యాప్‌లు సాపేక్షంగా తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.

టాటా గ్రూప్ కూడా డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా యూపీఐ పేమెంట్ యాప్ సర్వీసుల్లో మరింత పోటీ ఏర్పడనుంది. టాటా డిజిటల్ 2019లో స్థాపించారు. టాటా సన్స్ ద్వారా అనేక అనుబంధ సంస్థలను కలిగి ఉంది. ఈ జాబితాలో Bigbasket, 1MG Technologies Private Limited వంటి కంపెనీలు ఉన్నాయి. జనవరిలో, టాటా గ్రూప్ కూడా టాటా ఫిన్‌టెక్, ఆర్థిక ఉత్పత్తుల కోసం ఆర్థిక మార్కెట్‌ను ఏర్పాటు చేసింది.

Read Also : Tcs Jobs : టీసీఎస్ లో ఉద్యోగాలు…పీజీ పాసైన వారు అర్హులు