Top 5 Upcoming SUVs : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? రాబోయే టాప్ 5 SUV కార్లు ఇవే.. ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Top 5 upcoming SUVs : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2023 ఆర్థిక సంవత్సరంలో భారత మార్కెట్లో ప్యాసింజర్ వెహికల్ (PV)లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఆటో మొబైల్ కంపెనీలు మార్కెట్లోకి సరికొత్త SUV మోడల్ కార్లను ప్రవేశపెట్టనున్నాయి.

Top 5 Upcoming SUVs : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? రాబోయే టాప్ 5 SUV కార్లు ఇవే.. ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Top 5 upcoming SUVs _ Maruti Suzuki Jimny, Hyundai Exter, Tata Nexon facelift, Kia Seltos facelift, New Honda SUV

Top 5 upcoming SUVs : భారత మార్కెట్లో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (SUV) విభాగంలో ప్రతి ఏడాది సరికొత్త మోడల్ కార్లతో విస్తరిస్తోంది. ఆర్థిక సంవత్సరం(FY23)లో ప్యాసింజర్ వెహికల్ (PV) మార్కెట్‌లో (43శాతం) 1,673,488 యూనిట్లకు చేరుకుంది. ఆటో మొబైల్ పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రానున్న రోజుల్లో ప్యాసింజర్ వెహికల్స్‌ (SUV)లకు మరింత డిమాండ్ పెరగనుంది. ఇప్పటికే SUV కార్ల మార్కెట్ 48శాతం నుంచి 49శాతం వద్ద కొనసాగుతోంది. గత ఏడాదిలో దేశంలో కొన్ని సరికొత్త మోడల్‌ కార్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి.

ఈ ఏడాదిలోనూ మారుతి అనేక పాపులర్ కార్ల తయారీ కంపెనీలు అదే జోరును కొనసాగించనున్నాయి. అందులో రాబోయే టాప్ 5 అప్‌కమింగ్ SUV కార్లలో మారుతి సుజుకి జిమ్నీ, హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, హోండా వంటి ఆప్షన్లు ఉండనున్నాయి. ఏ కంపెనీ మోడల్ SUV కారు ఎప్పుడు లాంచ్ కానుంది? ఏయే ఫీచర్లు, ధర ఎంతవరకు ఉండొచ్చు అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..

మారుతీ సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) :
మారుతి సుజుకి జిమ్నీ (Jimny) వచ్చే మేలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ వెహికల్ దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ SUV పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయనుంది. ఇందులో ప్రస్తుతం కొత్తగా లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx), మారుతి సుజుకి బ్రెజ్జా, ఫ్లాగ్‌షిప్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఉన్నాయి.

Top 5 upcoming SUVs _ Maruti Suzuki Jimny, Hyundai Exter, Tata Nexon facelift, Kia Seltos facelift, New Honda SUV

Top 5 upcoming SUVs _ Maruti Suzuki Jimny, Hyundai Exter, Tata Nexon facelift, Kia Seltos facelift, New Honda SUV

మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఐదు-డోర్ల ఆఫ్‌రోడర్‌లో 1.5-లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ (103PS/134Nm) 5-స్పీడ్ MT, 4-స్పీడ్ AT ఆప్షన్లు ఉన్నాయి. మారుతి సుజుకి SUV విభాగంలో ALLGRIP PRO 4WD టెక్నాలజీతో లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ గేర్ (4L మోడ్)తో రానుంది.

Read Also : Flipkart Big Saving Sale : మే 5 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) :
హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ఇటీవలే ఎక్స్‌టర్ మైక్రో-SUV తొలి టీజర్ ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ ఏడాదిలో పండుగ సీజన్‌కు దగ్గరగా భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ప్రస్తుతం లెజెండరీ క్రెటా, వెన్యూ, అల్కాజార్, టక్సన్‌లను కలిగిన కార్‌మేకర్ SUV పోర్ట్‌ఫోలియోకు మరింతగా విస్తరించనుంది.

Top 5 upcoming SUVs _ Maruti Suzuki Jimny, Hyundai Exter, Tata Nexon facelift, Kia Seltos facelift, New Honda SUV

Top 5 upcoming SUVs _ Maruti Suzuki Jimny, Hyundai Exter, Tata Nexon facelift, Kia Seltos facelift, New Honda SUV

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.5 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చని అంచనా. ఈ కారు 5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT ఆప్షన్లతో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, హ్యుందాయ్ ఆరా (Aura) ద్వారా కూడా 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ (83PS/114Nm)ని పొందే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ (Tata Nexon facelift) :
ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV కార్లలో టాటా నెక్సాన్ మోడల్ ఒకటి. ఈ కారు అప్‌గ్రేడ్ వెర్షన్‌తో వచ్చింది. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌కి కొన్ని ప్రధాన ఎక్స్‌టీరియర్, ఇంటర్నల్ అప్‌డేట్స్ ఉన్నాయి. ఈ కారు మోడలళ్ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) పరిధిలో ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఇంజన్‌తోనే కొనసాగే అవకాశం ఉంది. Revotron 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120PS/170Nm), Revotorq 1.5-లీటర్ డీజిల్ (115PS/260Nm), ట్రాన్స్‌మిషన్ 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AMT ఆప్షన్లతో రానుంది.

Top 5 upcoming SUVs _ Maruti Suzuki Jimny, Hyundai Exter, Tata Nexon facelift, Kia Seltos facelift, New Honda SUV

Top 5 upcoming SUVs _ Maruti Suzuki Jimny, Hyundai Exter, Tata Nexon facelift, Kia Seltos facelift, New Honda SUV

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos facelift) :
ఆగస్ట్ 2019లో లాంచ్ అయిన కియా సెల్టోస్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన SUVలలో ఒకటిగా ఉంది. ఈ కార్‌మేకర్ ఈ ఏడాది భారత్‌లో అప్‌గ్రేడ్ మోడల్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 10.89 లక్షల నుంచి రూ. 19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. ఈ కారు 3 ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ 1.5-లీటర్ డీజిల్ వంటి ఆప్షన్లు ఉంటాయి.

Top 5 upcoming SUVs _ Maruti Suzuki Jimny, Hyundai Exter, Tata Nexon facelift, Kia Seltos facelift, New Honda SUV

Top 5 upcoming SUVs _ Maruti Suzuki Jimny, Hyundai Exter, Tata Nexon facelift, Kia Seltos facelift, New Honda SUV

కొత్త హోండా SUV (New Honda SUV) :
ఈ ఏడాది పండుగ సీజన్‌లో హోండా నుంచి భారత మార్కెట్లోకి సరికొత్త SUVని లాంచ్ చేసింది. ఈ SUV హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్‌లకు పోటీగా ఉంటుంది. రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రావొచ్చునని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 1.5-లీటర్ VTEC DOHC పెట్రోల్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉండనున్నాయి. కొత్త హోండా SUV ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

Top 5 upcoming SUVs _ Maruti Suzuki Jimny, Hyundai Exter, Tata Nexon facelift, Kia Seltos facelift, New Honda SUV

Top 5 upcoming SUVs _ Maruti Suzuki Jimny, Hyundai Exter, Tata Nexon facelift, Kia Seltos facelift, New Honda SUV

Read Also : Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. క్రేజీ డీల్ ఎప్పటినుంచంటే?