Elon Musk: ఎలన్ మస్క్‌పై న్యాయపోరాటానికి ట్విట్టర్ సిద్ధం

ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కచ్చితంగా కొనుగోలు చేయడమో లేక పోతే పరిహారం చెల్లించడమో చేసేలా ట్విట్టర్ కోర్టును ఆశ్రయించనుంది. వచ్చేవారం దీనిపై కోర్టులో కేసు నమోదు చేయాలని ట్విట్టర్ నిర్ణయించింది.

Elon Musk: ఎలన్ మస్క్‌పై న్యాయపోరాటానికి ట్విట్టర్ సిద్ధం

Elon Musk

Elon Musk: ట్విట్టర్‌తో కుదుర్చుకున్న 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎలన్ మస్క్‌పై ట్విట్టర్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయ సేవా సంస్థ అయిన ‘వాటెల్, లిప్టన్, రోసెన్ అండ్ కాట్జ్ ఎల్ఎల్‌పీ’ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

Eknath Shinde: షిండే భవితవ్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కచ్చితంగా కొనుగోలు చేయడమో లేక పోతే పరిహారం చెల్లించడమో చేసేలా ట్విట్టర్ కోర్టును ఆశ్రయించనుంది. వచ్చేవారం దీనిపై కోర్టులో కేసు నమోదు చేయాలని ట్విట్టర్ నిర్ణయించింది. ఎలన్ మస్క్ తరఫున క్విన్ ఎమాన్యుయెల్ ఉర్కాహార్ట్ అండ్ సల్లివాన్ అనే న్యాయ సంస్థ పనిచేస్తుంది. ఎలన్ మస్క్ తన కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకోవడంపై ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టైలర్ స్పందించారు. నిర్ణయించిన ధరకు ట్విట్టర్ ఒప్పందాన్ని ముగించేందుకు ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మస్క్ నిర్ణయంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలే మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Pawan Kalyan : ప్రశ్నిస్తే బెదిరించడం, భయపెట్టడం వైసీపీ నైజం-పవన్ కళ్యాణ్

అయితే, ఒప్పందంలో నియమాలు ఉల్లంఘించడం వల్ల ఈ డీల్ రద్దు చేసుకుంటున్నట్లు గత శుక్రవారం ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఫేక్/స్పామ్ అకౌంట్ల సమాచారం ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైందని, అందువల్లే డీల్ రద్దు చేసుకుంటున్నానని వెల్లడించాడు. కంపెనీ చెబుతున్నట్లు కాకుండా ఐదు కంటే ఎక్కువ శాతం ఫేక్ అకౌంట్లు ఉన్నట్లు ఎలన్ మస్క్ భావిస్తున్నాడు. ఏప్రిల్‌లో ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం కుదిరింది. అయితే దీన్ని మేలో హోల్డ్‌లో ఉంచినట్లు ఎలన్ మస్క్ ప్రకటించాడు. తాజాగా ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు.