పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై నిషేధం.. వచ్చేవారమే ప్రధాని కీలక ప్రకటన

10TV Telugu News

UK to ban sale of new petrol and diesel cars from 2030 : యూకేలో 2030 నాటికి పెట్రోల్‌, డీజిల్‌ కార్ల అమ్మకాలపై నిషేధం విధించనున్నారు. దీనిపై వచ్చేవారమే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఒక కీలక ప్రకటన చేయనున్నారు. గతంలోనే పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధానికి సంబంధించి ప్లాన్ చేసింది.అనుకున్న దానికంటే ఐదేళ్లు ముందుగానే నిషేధాన్ని అమల్లోకి తీసుకురావాలని జాన్సన్ ప్రభుత్వం యోచిస్తోందని ఒక నివేదిక వెల్లడించింది.

వాస్తవానికి బ్రిటన్‌ 2040 నాటికి పెట్రోల్‌, డీజిల్‌ కార్లను నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకొంది. కానీ, బోరిస్‌ జాన్సన్‌ అధికారం చేపట్టాక నిషేధిత గడువును 2035గా మార్చింది.ఇప్పుడు ఆ గడువును మరింత ముందుకు తెచ్చి 2030కి కుదించనుంది. పర్యావరణ విధానంపై వచ్చేవారం జాన్సన్ ప్రసగించనున్నారు. ఈ సందర్భంగా నిషేధిత గడువును 2030కు కుదిస్తారని నివేదిక పేర్కొంది.
https://10tv.in/sale-of-loose-cigarettes-beedis-likely-to-be-banned-in-delhi/
బీబీసీ కూడా ఇదే విషయంపై గత వారమే కథనాన్ని ప్రచురించింది. జాన్సన్ మాట్లాడబోయే అంశంపై స్పందించేందుకు బ్రిటన్ ప్రధాని కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు.పెట్రోల్‌, ఎలక్ట్రానిక్‌ ఇంజిన్లతో నడిచే హైబ్రీడ్‌ కార్లకు మినహాయింపు ఉండే అవకాశం ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ కార్ల అమ్మకాలు నిలిచిపోతే.. బ్రిటన్‌ ఆటోమొబైల్‌ మార్కెట్లను మరో మలుపు తిప్పుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ బ్రిటన్‌ మార్కెట్లో కొత్త పెట్రోల్, డీజిల్ మోడల్ కార్ల వాటా 73.6శాతం ఉంది.పూర్తిగా ఎలక్ట్రికల్ వాహనాల విక్రయాలు 5.5శాతంగా నమోదయ్యాయి. ఎంతో ఖరీదైనవి కూడా. హైబ్రిడ్ వాహనాల్లోనూ వివిధ రకాల మోడళ్లలో విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయి.