Trading Partner: భారత్‌తో వ్యాపారం.. చైనాను దాటిన అమెరికా

ఇప్పటివరకు ఇండియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్న చైనాను దాటి మొదటి స్థానంలో నిలిచింది అమెరికా. గత ఏడాది భారత్‌తో అత్యధిక వ్యాపారం చేసిన దేశంగా అమెరికా నిలిచినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించింది.

Trading Partner: భారత్‌తో వ్యాపారం.. చైనాను దాటిన అమెరికా

Trading Partner

Tading Partner: ఇప్పటివరకు ఇండియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్న చైనాను దాటి మొదటి స్థానంలో నిలిచింది అమెరికా. గత ఏడాది భారత్‌తో అత్యధిక వ్యాపారం చేసిన దేశంగా అమెరికా నిలిచినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవ్సతరానికిగాను అమెరికా-ఇండియా మధ్య 119.42 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగినట్లు వెల్లడించింది. వాణిజ్య శాఖ అంచనా ప్రకారం.. అంతకుముందు ఏడాది, అంటే 2020-21లో ఈ బిజినెస్ విలువ 80.51 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేది.

monkeypox: ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?

కానీ, గత ఏడాది ఇరు దేశాల మధ్య గణనీయమైన వ్యాపారం జరిగింది. ఎగుమతులు, దిగుమతులు రెండూ పెరిగాయి. 2020-21లో అమెరికాకు భారత ఎగుమతుల విలువ 51.62 బిలియన్ డాలర్లు ఉండగా, 2021-22లో 76.11 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020-21లో దిగుమతులు 29 బిలియన్ డాలర్లు ఉండగా, 2021-22లో 43.31 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021-22కు గాను చైనాతో భారత వ్యాపార విలువ 115.42 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఈ విలువ 86.4 బిలియన్ డాలర్లుగా ఉంది. చైనాతో కూడా మన దేశ వ్యాపార విలువ పెరిగింది. కానీ, అమెరికాతో అంతకంటే ఎక్కువ వ్యాపారం కలిగి ఉంది. రాబోయే రోజుల్లో కూడా అమెరికాతో భారత్ ఇలాంటి వ్యాపార విలువనే కలిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా గణాంకాలు అమెరికా-భారత్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలకు నిదర్శనంగా చెబుతున్నారు నిపుణులు.

PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ

‘‘భారత్ విశ్వసనీయత కలిగిన వ్యాపార భాగస్వామిగా ఉంది. ప్రపంచం కూడా తన అవసరాల కోసం చైనాపై ఆధారపడటం తగ్గిస్తోంది. అనేక దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. చాలా దేశాలు తమ వ్యాపారాలను భారత్‌కు మళ్లిస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత్-అమెరికా వ్యాపార సంబంధాలు మరింత బలపడతాయి. ఇప్పటికే భారత్ ‘ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్’లో చేరింది. ఈ నిర్ణయం మరిన్ని వ్యాపార అవకాశాలను పెంచుతుంది’’ అని ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్’ వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ ఖాన్ అన్నారు. అమెరికా తర్వాత చైనా, యూఏఈ ఇండియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.