PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ

కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కేర్స్ పథకం నిధులు సోమవారం విడుదల కానున్నాయి. మే 30న ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోదీ ప్రారంభిస్తారని కేంద్రం ప్రకటించింది.

PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ

Pm Cares

PM Cares: కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కేర్స్ పథకం నిధులు సోమవారం విడుదల కానున్నాయి. మే 30న ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోదీ ప్రారంభిస్తారని కేంద్రం ప్రకటించింది. దేశంలో కోవిడ్ కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Kedarnath: కేదార్‌నాథ్‌లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే

అందులో స్కూలుకెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దీంతో ఆ చిన్నారులు అనాథలుగా మారారు. అలాంటి పిల్లల్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిందే పీఎం కేర్స్ పథకం. గతేడాది మే 29న మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. కోవిడ్ కారణంగా తల్లీ, తండ్రీ ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులు.. దత్తత తీసుకున్నవారు, సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న వాళ్లను కోల్పోయిన పిల్లలతోపాటు కరోనా కారణంగా తమకు ఆర్థికంగా, అండగా నిలబడే వాళ్లను కోల్పోయిన పిల్లలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా అలాంటి చిన్నారులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో ఆర్థిక సాయం అందుతుంది. నిధులు అందే పాస్‌బుక్‌ను, ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డులను చిన్నారులకు పీఎం కేర్స్ కింద అందజేస్తారు.

monkeypox: ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?

ఈ పథకానికి 11, మార్చి 2020-28, ఫిబ్రవరి 2022లోపు తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్లు మాత్రమే అర్హులు. ఈ పథకం ద్వారా అందే నిధులతో పిల్లలు సొంత శక్తితో ఎదగగలుగుతారని, అవి వాళ్ల వికాసానికి తోడ్పడతాయని కేంద్రం అంటోంది. గరిష్టంగా పది లక్షల వరకు పీఎం కేర్స్ ద్వారా సాయం అందుతుంది. చిన్నారులకు 23 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకం కొనసాగుతుంది.