లేటెస్ట్ Beta వెర్షన్ : ఐఫోన్లలో వాట్సాప్ Dark Mode ఫీచర్ 

  • Published By: sreehari ,Published On : February 8, 2020 / 04:47 AM IST
లేటెస్ట్ Beta వెర్షన్ : ఐఫోన్లలో వాట్సాప్ Dark Mode ఫీచర్ 

ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్ త్వరలో రాబోతోంది. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ప్రత్యేకించి అప్ డేట్స్, సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఆండ్రాయిడ్ యూజర్లలో బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ డార్క్ మోడ్ ఫీచర్.. అతి త్వరలో ఐఫోన్లలో రానుంది.

ఐఫోన్ iOS డివైజ్ కొత్త బీటా వెర్షన్ వాట్సాప్ లో డార్క్ మోడ్ ఎనేబుల్ అయింది. త్వరలో స్టేబుల్ వెర్షన్ ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. డార్క్ మోడ్ పై టెస్టింగ్ రన్ నడుస్తోందని మ్యాక్ రుమార్స్ రిపోర్టు తెలిపింది.ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ డార్క్ మోడ్ ఫీచర్ పాపులర్ ఐఓఎస్ యాప్స్‌లో ఇదివరకే అప్ డేట్ అయింది.

మరోవైపు వాట్సాప్ ఇలాంటి డార్క్ మోడ్ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం టెస్టింగ్ చేస్తోంది. గతనెలలోనే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో డార్క్ మోడ్ ఫీచర్ కనిపించింది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్‌లో APK ద్వారా ఈజీగా ఫీచర్ పొందవచ్చు. కానీ, ఐఓఎస్ యూజర్లు మాత్రం వాట్సాప్ టెస్ట్ ఫ్లయిట్ ప్రొగ్రామ్‌లో (పూర్తి నెలల సమయం) జాయిన్ కావాల్సి ఉంటుంది.