Zomato Gold: ‘జొమాటో గోల్డ్’ సర్వీస్ తిరిగి ప్రారంభం.. ‘ఇన్‌స్టంట్’ సర్వీసు కొత్తగా వస్తుందన్న సంస్థ

2021లో రద్దైన ‘ప్రో ప్లస్’ మెంబర్‌షిప్‌ను తిరిగి ‘జొమాటో గోల్డ్‌’గా ప్రారంభించింది. ఇది లాయల్టీ ప్రోగ్రామ్. త్వరలోనే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ‘జొమాటో గోల్డ్’ ద్వారా యూజర్లకు అనేక ప్రయోజనాలుంటాయని సంస్థ వెల్లడించింది. ఆన్‌లైన్ ఆర్డర్లపై 30 శాతం వరకు డిస్కౌంట్‌తోపాటు, ఉచితంగా డెలివరీ లభిస్తుంది.

Zomato Gold: ‘జొమాటో గోల్డ్’ సర్వీస్ తిరిగి ప్రారంభం.. ‘ఇన్‌స్టంట్’ సర్వీసు కొత్తగా వస్తుందన్న సంస్థ

Zomato Gold: ‘జొమాటో గోల్డ్’ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆ సంస్థ తిరిగి ప్రారంభించింది. 2021లో రద్దైన ‘ప్రో ప్లస్’ మెంబర్‌షిప్‌ను తిరిగి ‘జొమాటో గోల్డ్‌’గా ప్రారంభించింది. ఇది లాయల్టీ ప్రోగ్రామ్. త్వరలోనే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ‘జొమాటో గోల్డ్’ ద్వారా యూజర్లకు అనేక ప్రయోజనాలుంటాయని సంస్థ వెల్లడించింది.

Pawan Kalyan: తెలంగాణలో పోటీకి సిద్ధం.. బీజేపీతోనే జనసేన దోస్తీ: పవన్ కల్యాణ్

ఆన్‌లైన్ ఆర్డర్లపై 30 శాతం వరకు డిస్కౌంట్‌తోపాటు, ఉచితంగా డెలివరీ లభిస్తుంది. పది కిలోమీటర్ల లోపు రెస్టారెంట్లపై, అలాగే రూ.199 కంటే ఎక్కువ విలువ కలిగిన ఆర్డర్లపై మాత్రమే ఉచిత డెలివరీ లభిస్తుంది. డైనింగ్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ‘జొమాటో గోల్డ్’ సర్వీస్ ఛార్జి మూడు నెలలకు రూ.149గా నిర్ణయించింది సంస్థ. లాంచింగ్ ఆఫర్ కింద మాత్రమే ఇంత తక్కువ ధరకు అందిస్తోంది. ‘జొమాటో గోల్డ్’ సర్వీస్‌కు సంబంధించి వార్షిక ఫీజును కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ‘జొమాటో గోల్డ్’ లాంటి సర్వీస్‌నే స్విగ్గీ కూడా అందిస్తోంది. ‘స్విగ్గీ వన్’ పేరుతో ఈ సర్వీస్ రూ.149కి అందిస్తోంది. ‘జొమాటో గోల్డ్’ కింద ‘నో డిలే గ్యారెంటీ’ అనే మరో ఆఫర్ కూడా అందుతుంది.

India vs New Zealand: రోహిత్, గిల్ సెంచరీలు.. మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం 386

అంటే ఆర్డర్ ఆలస్యం అయితే, వెంటనే రూ.100 జొమాటో కూపన్ లభిస్తుంది. రష్ అవర్స్‌లో వీఐపీ యాక్సెస్ కూడా ఉంటుంది. సాధారణ యూజర్లతో పోలిస్తే రెస్టారెంట్లు రద్దీగా ఉన్న సమయంలో ‘జొమాటో గోల్డ్’ యూజర్లకు దీని ద్వారా ప్రాధాన్యం ఉంటుంది. మరోవైపు ఇప్పటివరకు ఉన్న జొమాటో ‘ఇన్‌స్టంట్’ సర్వీస్‌ను కంపెనీ రద్దు చేసింది. అయితే, ఇది పూర్తిగా రద్దు కాదని.. దీన్ని ‘రీ బ్రాండింగ్’ చేస్తున్నామని తెలిపింది. ఈ సర్వీస్ ద్వారా కొన్ని ఆహార పదార్థాల్ని కంపెనీ 10 నిమిషాల్లోనే డెలివరీ చేసేది. అయితే, దీనికి పెద్దగా ఆదరణ దక్కలేదు. దీంతో ఈ సర్వీస్ విషయంలో కంపెనీ పునరాలోచన చేసింది.