India vs New Zealand: రోహిత్, గిల్ సెంచరీలు.. మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం 386

మొదట టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్, గిల్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు.

India vs New Zealand: రోహిత్, గిల్ సెంచరీలు.. మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం 386

India vs New Zealand: ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి, 385 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముందు 386 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.

Pawan Kalyan: తెలంగాణలో పోటీకి సిద్ధం.. బీజేపీతోనే జనసేన దోస్తీ: పవన్ కల్యాణ్

మొదట టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్, గిల్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. తొలి వికెట్‌కే ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం. తొలి వికెట్‌కు 212 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. రోహిత్ శర్మ 85 బంతుల్లో 101 పరుగులు చేసి ఔటయ్యారు. రోహిత్ 9 ఫోర్లు, 6 సిక్సర్లు సాధించాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 78 బంతుల్లో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ 27 బంతుల్లో 36 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.

Rahul Gandhi: సర్జికల్ స్ట్రైక్స్‌పై ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు.. దిగ్విజయ్ వ్యాఖ్యలు సరికాదు: రాహుల్ గాంధీ

విరాట్ ఇన్నింగ్స్‌‌లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. తర్వాత ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 17 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 9 బంతుల్లో 14 పరుగులు, హార్ధిక్ పాండ్యా 38 బంతుల్లో 54 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 14 బంతుల్లో 9 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 17 బంతుల్లో 25 పరుగులు, కుల్దీప్ యాదవ్ 3 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఉమ్రాన్ మాలిక్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. న్యూజిలాండ్ విజయ లక్ష్యం 386 పరుగులు.

న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ, బ్లెయిర్ టిక్నర్ తలో మూడు వికెట్లు తీయగా, బ్రేస్‌వెల్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించడం విశేషం. 2020 జనవరి తర్వాత రోహిత్ వన్డేల్లో సెంచరీ సాధించడం ఇప్పుడే. ఇది రోహిత్‌కు వన్డేల్లో 30వ సెంచరీ. శుభ్‌మన్ గిల్‌కు వన్డేల్లో 4వ సెంచరీ.