Online Dating app: డేటింగ్ యాప్ లింక్ నొక్కాడు.. ఇద్దరమ్మాయిలతో చాటింగ్.. రెండేళ్లుగా నరకయాతన.. చివరికి తెగించి ..

అతను ఓ ప్రైవేట్ ఉద్యోగి. అనుకోకుండా ఓ రోజు అతని ఫోన్‌కు డేటింగ్ యాప్ లింక్ వచ్చింది. అసలేం ఉందో చూద్దామని లింక్ నొక్కాడు.. ఆ లింక్ ఓపెన్ చేసిన పాపానికి రెండేళ్లుగా నరకయాతన అనుభవించాడు. లింక్ ఓపెన్ చేయగానే ఇద్దరు అమ్మాయిలు చాటింగ్ లోకి వచ్చారు. కవ్వించే మాటలతో మత్తెక్కించి అతని నగ్ర చిత్రాలను సేకరించారు.. అప్పటి నుంచి మొదలైంది టార్చర్..

Online Dating app: డేటింగ్ యాప్ లింక్ నొక్కాడు.. ఇద్దరమ్మాయిలతో చాటింగ్.. రెండేళ్లుగా నరకయాతన.. చివరికి తెగించి ..

online dating app

Online Dating app: అతను ఓ ప్రైవేట్ ఉద్యోగి. అనుకోకుండా ఓ రోజు అతని ఫోన్‌కు డేటింగ్ యాప్ లింక్ వచ్చింది. అసలేం ఉందో చూద్దామని లింక్ నొక్కాడు.. ఆ లింక్ ఓపెన్ చేసిన పాపానికి రెండేళ్లుగా నరకయాతన అనుభవించాడు. లింక్ ఓపెన్ చేయగానే ఇద్దరు అమ్మాయిలు చాటింగ్ లోకి వచ్చారు. కవ్వించే మాటలతో మత్తెక్కించి అతని నగ్ర చిత్రాలను సేకరించారు.. అప్పటి నుంచి మొదలైంది టార్చర్.. రోజూ ఫోన్ చేయడం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. లేకుంటే నగ్నచిత్రాలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అలా రెండేళ్లుగా నరకం చూపిస్తూ రూ. 2.18లక్షలు దోచుకున్నారు.. తీరా అతని ఫోన్ నెంబర్ వ్యభిచార వెబ్ సైట్లలో ఉంచడంతో భరించలేక పోయిన బాధితుడు తెగించేసి సైబరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

Dating App Fraud : వామ్మో.. డేటింగ్ యాప్ మోజులో రూ.కోటిన్నర సమర్పించుకున్న హైదరాబాద్ డాక్టర్

హైదరాబాద్ మియాపూర్ కు చెందిన వ్యక్తి 2020 ఆగస్టులో ఆన్‌లైన్‌లోలొకాంటో పేరుతో ఉన్న డేటింగ్ యాప్ లింక్ క్లిక్ చేశాడు. ఆ తర్వాత శృతి పేరుతో సైబర్ నేరుగాళ్లు అతనితో చాటింగ్ చేశారు. మోక్ష పేరుతో మరొకరు చాటింగ్ చేశారు. ఇద్దరు అమ్మాయిలు చాటింగ్ చేస్తూ మత్తెక్కించే మాటలతో కవ్విస్తుంటే మైమర్చిపోయి వాళ్లు చెప్పిందల్లా చేశాడు. దీంతో వారు బాధితుడి నగ్న చిత్రాలు, చాటింగ్ వివరాలను సేకరించి మీ కుటుంబ సభ్యులకు పెడతామంటూ బెదిరించడం మొదలు పెట్టారు. అప్పటి వరకు చాటింగ్ చేసిన అమ్మాయిలు ఇలా అంటున్నారేంటి అని అసలు విషయం ఆరా తీయగా వారు సైబర్ నేరగాళ్లని తెలుసుకున్నాడు. దీంతో తొలుత వారు అడిన సొమ్ము పంపించాడు. మళ్లీ నగ్నచిత్రాలు సోషల్ మీడియాలో పెడతాం, ఫోన్ నెంబర్ వ్యభిచార వెబ్ సైట్లో పెడతాం అంటూ బెదిరించి అలా రెండేళ్లుగా సుమారు 90 నుంచి 100 సార్ల వరకు డబ్బులు కాజేశారు. అలా రెండేళ్లలో బాధితుడు రూ. 2.18 లక్షలు సమర్పించుకున్నాడు.

Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా

బయటకు చెబితే పరువు పోతుందనే బాధతో రెండేళ్లుగా వారు అడిగినంత డబ్బు పంపిస్తూ వచ్చారు. అయినా వారు అతని ఇన్‌స్టా గ్రామ్ ఖాతాను హ్యాక్ చేసి స్నేహితుల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు సేకరించి వారికి కూడా బాధితుడి వ్యక్తిగత సమాచారాన్ని, నగ్న ఫొటోలను పంపించారు. అంతటితో ఆగకుండా వ్యభిచార వెబ్ సైట్లలో అతని నెంబర్ ను ఉంచారు. తట్టుకోలేక పోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసి విషయాన్ని తెలిపారు. కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.