Dating App Fraud : వామ్మో.. డేటింగ్ యాప్ మోజులో రూ.కోటిన్నర సమర్పించుకున్న హైదరాబాద్ డాక్టర్

సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. డేటింగ్ పేరుతో అమాయకులకు వల వేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. వారి ఉచ్చులో పడిన ఓ డాక్టర్ ఏకంగా కోటిన్నర రూపాయలు పొగొట్టుకోవడం షాక్ కి గురి చేస్తోంది.

Dating App Fraud : వామ్మో.. డేటింగ్ యాప్ మోజులో రూ.కోటిన్నర సమర్పించుకున్న హైదరాబాద్ డాక్టర్

Dating App Fraud

Dating App Fraud : సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. డేటింగ్ పేరుతో అమాయకులకు వల వేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. వారి ఉచ్చులో ఇప్పుడు ఓ డాక్టర్ పడ్డాడు. దాదాపు కోటిన్నర రూపాయలు సమర్పించుకున్నాడు. చివరికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.

హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ డేటింగ్ యాప్ మోజులో పడ్డాడు. 2020లో ఓ డేటింగ్ యాప్ కు బానిసయ్యాడు. అందులో హనీ ట్రాప్ చేసిన కొందరు.. డాక్టర్ నుంచి లక్షల కొద్దీ డబ్బు గుంజారు. అడిగినప్పుడల్లా డాక్టర్ డబ్బు ట్రాన్సఫర్ చేసేవాడు. తర్వాత అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.(Dating App Fraud)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అలా ఒకటి రెండు కాదు ఏకంగా మూడుసార్లు పోలీసుల వద్దకు వెళ్లాడు. వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం, నేరస్తులను పట్టుకుంటామని చెప్పడంతో డాక్టర్ కొద్ది రోజులు సైలెంట్ అయ్యాడు. ఇటీవల అదే క్రిమినల్స్ మళ్లీ డాక్టర్ కు వల విసరడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. మొత్తంగా కోటిన్నర రూపాయలు పొగొట్టుకున్నానని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సైబర్ కిలాడీలు : ఆదిలాబాద్‌లో ఆరోగ్యశ్రీ పేరిట రూ. 81 వేలు కొట్టేశారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత డాక్టర్ కొన్నేళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్‌లో అడుగు‌పెట్టాడు. అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయగా.. అవతలి నుంచి అమ్మాయిలు మాట్లాడింది. పక్కా ప్లాన్‌తో డాక్టర్‌ను ఉచ్చులో పడేసింది. అతనితో చాటింగ్ చేస్తూ రూ.41 లక్షలు కాజేసింది. ఈ విషయం తెలిసిన డాక్టర్ కుటుంబం రెండేళ్ల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే డేటింగ్ యాప్‌కు బానిసగా మారిన డాక్టర్.. రెండు నెలల తర్వాత మరోసారి అందులోకి అడుగుపెట్టాడు. చాటింగ్, వీడియో చాటింగ్ చేస్తూ దాదాపు రూ.30 లక్షలు పోగొట్టాడు. ఆ డాక్టర్ తాను దాచుకున్న మొత్తంతో పాటు.. అప్పులు చేసి మరీ డబ్బు సమర్పించుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మూడోసారి డాక్టర్ కి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ లు వచ్చాయి. దీంతో మరోసారి పలు దఫాల్లో రూ.80 లక్షల వరకు చెల్లింపులు చేశాడని తెలుస్తోంది.

సైబర్ క్రిమినల్స్ టార్గెట్ వాళ్లే..

డేటింగ్ యాప్‌ మోజులో పడి సదరు డాక్టర్ ఏకంగా కోటిన్నర రూపాయలు పోగొట్టుకోవడం పోలీసులతో పాటు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఆ డాక్టర్ ప్రవర్తన చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రెండు సార్లు మోసపోయినా.. మూడోసారి మళ్లీ యాప్ జోలకి వెళ్లడం విస్మయానికి గురి చేస్తోంది. కాగా, డేటింగ్ యాప్‌ల ద్వారా మోసపోతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది.