Uttarakhand: 700 మీటర్ల లోయలో పడిపోయిన బస్సు.. 12 మంది మృతి

ఈ విషయమై ఎస్‭డీఆర్ఎఫ్ మీడియా ఇంచార్జి లలిత నేగి స్పందిస్తూ ‘‘12 మంది ప్రయాణికులతో వెళ్తోన్న టాటా సుమో (కారు) లోతైన లోయలో పడిపోయింది. అందులో ఉన్న 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మా టీం వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మృతదేహాలన్నింటినీ వెలికి తీశాము’’ అని అన్నారు. ప్రమాదానికి గురైన కారు, జోషిమత్ ప్రాంతంలోని కిమన గ్రామానికి చెందినదని అధికారులు తెలిపారు.

Uttarakhand: 700 మీటర్ల లోయలో పడిపోయిన బస్సు.. 12 మంది మృతి

Vehicle carrying 12 falls in deep gorge in Chamoli, all dead

Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోయారు. శుక్రవారం 12 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఒక కారు చమోలి ప్రాంతంలోని పల్ల జఖోల్ గ్రామ సమీపంలో 700 మీటర్ల లోతు ఉన్న లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సెంట్రల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కాగా 10 మంది పురుషులు. ఇప్పటికే మృతదేహాలను వెలికి తీసినట్లు సెంట్రల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు తొందరలో తెలియజేస్తామని వారు పేర్కొన్నారు.

ఈ విషయమై ఎస్‭డీఆర్ఎఫ్ మీడియా ఇంచార్జి లలిత నేగి స్పందిస్తూ ‘‘12 మంది ప్రయాణికులతో వెళ్తోన్న టాటా సుమో (కారు) లోతైన లోయలో పడిపోయింది. అందులో ఉన్న 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మా టీం వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మృతదేహాలన్నింటినీ వెలికి తీశాము’’ అని అన్నారు. ప్రమాదానికి గురైన కారు, జోషిమత్ ప్రాంతంలోని కిమన గ్రామానికి చెందినదని అధికారులు తెలిపారు.

Twitter At Risk : ఉద్యోగుల రాజీనామాలతో డేంజర్‌లో ట్విట్టర్.. ఏ క్షణమైన షట్‌డౌన్ కావొచ్చు.. యూజర్లు అకౌంట్ డేటాను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!