Marijuana smuggling : విశాఖ నుంచి తరలిస్తున్న 10క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్న సంగారెడ్డి పోలీసులు

విశాఖ నుంచి లారీలో 10 క్వింటాళ్ల గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Marijuana smuggling : విశాఖ నుంచి తరలిస్తున్న 10క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్న సంగారెడ్డి పోలీసులు

Marijuana Smuggling

Marijuana smuggling : మత్తుపదార్ధాల స్మగ్లింగ్ పై పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా కేటుగాళ్లు ఏదో రకంగా తరలిస్తునే ఉన్నారు. గంజాయి స్మగ్లింగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుక్షణం అప్రమత్తంగా తనికీలు నిర్వహిస్తునే ఉన్నారు. అయినా స్మగ్లర్లు పలురకాలుగా తరలింపులు కొనసాగిస్తునే ఉన్నారు. ఈక్రమంలో మరోసారి స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి గంజాయి తరలిస్తుండగా తెలంగాణా పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.

విశాఖ నుంచి తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో సంగారెడ్డి పోలీసులు గంజాయి స్మగ్లర్లు పట్టుకున్నారు. విశాఖ నుంచి లారీలో 10 క్వింటాళ్లు తీసుకొస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో గంజాయి రవాణా చేస్తున్న లారీని గుర్తించారు. ఆదివారం (నవంబర్ 28,2021)అర్ధరాత్రి సమయంలో కంది గ్రామం వద్ద పోలీసులు ఆ లారీని ఆపి తనిఖీ చేయగా తుక్కు కింద గంజాయి మూటలు కనిపించాయి. దీంతో గంజాయిని సీజ్‌ చేసి దాన్ని రవాణా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదనపు సమాచారం కోసం దర్యాప్తు ప్రారంభించారు.

కాగా..గంజాయి అమ్మకాలు ఆన్ లైన్ లో కూడా యదేశ్చగా జరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులు క్రితం విశాఖపట్నం నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు అమెజాన్‌ ద్వారా గంజాయి రవాణా వ్యవహారంలో ఐదుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయుర్వేద ఆకుల పేరుతో అమెజాన్‌ ద్వారా ఇప్పటివరకు ఆరేడు వందల కిలోల గంజాయిని రవాణా చేస్తున్న విషయం బయటపడింది.