Racial Attack: జాతి వివక్ష.. క్లాస్‌మేట్‌కు నిప్పంటించిన విద్యార్థులు

జాతి వివక్ష కారణంతో తోటి విద్యార్థికి తరగతి గదిలో నిప్పంటించారు కొందరు విద్యార్థులు. మెక్సికోలోని క్యురెటారోలో గత జూన్‌లో ఈ ఘటన జరిగింది. జువాన్ జామోరానో అనే పద్నాలుగేళ్ల విద్యార్థి అక్కడి అరుదైన ఒటోమి తెగకు చెందిన వాడు.

Racial Attack: జాతి వివక్ష.. క్లాస్‌మేట్‌కు నిప్పంటించిన విద్యార్థులు

Racial Attack

Racial Attack: ప్రపంచ వ్యాప్తంగా ఇంకా అనేక దేశాల్లో జాతి వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా మెక్సికోలో జరిగిన ఘటనే దీనికి మరో నిదర్శనం. జాతి వివక్ష కారణంతో తోటి విద్యార్థికి తరగతి గదిలో నిప్పంటించారు కొందరు విద్యార్థులు. మెక్సికోలోని క్యురెటారోలో గత జూన్‌లో ఈ ఘటన జరిగింది. జువాన్ జామోరానో అనే పద్నాలుగేళ్ల విద్యార్థి అక్కడి అరుదైన ఒటోమి తెగకు చెందిన వాడు.

Heavy Rainfall: మరో ఐదు రోజులు వానాలే!

అతడి తల్లి ఒటోమీ తెగ కావడంతో జువాన్ కూడా ఎక్కువగా అదే భాష మాట్లాడుతాడు. అయితే, స్కూళ్లో, క్లాసులో కూడా జువాన్ అదే భాష మాట్లాడేవాడు. దీంతో అతడి భాష, సంస్కృతిని టీచర్లతోపాటు తోటి విద్యార్థులు హేళన చేసేవారు. అనేక రకాలుగా వేధించారు. ఈ భాష మాట్లాడితే అతడ్ని చులకనగా చూసేవారు. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులు క్లాస్‌రూమ్‌లో జువాన్‌కు నిప్పంటించారు. ఒక విద్యార్థి ఆల్కహాల్ పోస్తే, మరొక విద్యార్థి నిప్పంటించాడు. దీంతో తరగతి గదిలోనే అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. బాలుడికి సెకండ్, థర్డ్ డిగ్రీ గాయాలయ్యాయి. అయినప్పటికీ కొన్ని వారాల చికిత్స అనంతరం కోలుకుని, ఇటీవలే డిశ్చార్జ్ అయ్యాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.

Cold Tea: సీఎంకు చల్లటి టీ ఇచ్చిన అధికారులు.. నోటీసులు జారీ

నిప్పంటించిన విద్యార్థులతోపాటు, టీచర్లపైనా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మెక్సికోలో ఒటోమీ తెగకు చెందిన వారు దాదాపు మూడున్నర లక్షల మంది ఉంటారు. వీరు ప్రాచీన లాటిన్ అమెరికాకు చెందిన వారు. కొంతకాలంగా అక్కడ ఈ తెగ వారిపై జాతి వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. వీటిపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మెక్సికోలో దాదాపు 40 శాతం మంది ఆదిమ తెగలకు చెందిన వారు వివక్ష ఎదుర్కొంటున్నట్లు తాజా నివేదిక తెలిపింది.