Maharashtra: బాలికపై పదిహేనేళ్ల బాలుడి హత్యాచారం.. బాలిక తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దారుణం

తనతో గొడవపడ్డ ఒక వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి కూతురుపై హత్యాచారానికి పాల్పడ్డాడో బాలుడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో గురువారం జరిగింది.

Maharashtra: బాలికపై పదిహేనేళ్ల బాలుడి హత్యాచారం.. బాలిక తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దారుణం

Maharashtra: తనపై దాడికి పాల్పడ్డ ఒక వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి చిన్నారి కూతురుపై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేశాడు ఒక బాలుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో గురువారం జరిగింది.

Akhilesh Yadav: 100 మంది ఎమ్మెల్యేలను తీసుకురండి.. సీఎం అవ్వండి.. యూపీ డిప్యూటీ సీఎంలకు అఖిలేష్ ఆఫర్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్ ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తి తన ఇంటి దగ్గరలో ఉండే పదిహేనేళ్ల బాలుడితో ఇటీవల గొడవపడి దాడి చేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఆ బాలుడు తనపై దాడి చేసిన ఆ వ్యక్తిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. ఇందుకు సరైన సమయం కోసం ఎదురు చూశాడు. అతడి తొమ్మిదేళ్ల కూతురు ఒంటరిగా ఉన్న సమయంలో ఆ బాలికను కిడ్నాప్ చేశాడు. అనంతరం దూరంగా రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు కోసం చంపేశాడు. బాలిక చనిపోయిన తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం బాలిక మృతదేహం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు, బాలిక తండ్రికి సమాచారం అందించారు.

IPL Auction: డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం.. పోటీలో 991 మంది ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా ప్లేయర్సే టాప్

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపగా బాలుడిపై అనుమానం వచ్చింది. అతడి గురించి ఆరా తీయగా గొడవ విషయం తెలిసింది. అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలించారు. దీంతో బాలుడిపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితుడిపై పోక్సోతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.