Tamil Nadu: 2వ క్లాసు కొడుకును కొట్టాడంటూ టీచర్‭ను చితకబాదిన తల్లిదండ్రులు

భార్యాభర్తలు భరత్‌పై దాడి చేస్తుండడంతో మరో టీచర్ సహాయం కోసం కేకలు వేసింది. పోలీసులు దంపతులతో పాటు చిన్నారి తాత మునుసామిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాడి, నేరపూరిత బెదిరింపు, కుట్ర, ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వర్తించకుండా నిరోధించడం వంటి నేరాలకు మేము వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ బాలాజీ శరవణన్ చెప్పారు

Tamil Nadu: 2వ క్లాసు కొడుకును కొట్టాడంటూ టీచర్‭ను చితకబాదిన తల్లిదండ్రులు

2nd class student parents beaten up teacher in tamilnadu

Tamil Nadu: మన దేశంలోని పాఠశాలల్లో విద్యార్థులను కొట్టడం సర్వసాధారణం. పాఠశాలలు ఏంటి, కాలేజీల్లో అయినా కొట్టడం కొట్టడమే. విద్యార్థుల మీద టీచర్లకు ఈ దేశంలో అంతటి కమాండ్ పెరిగిపోయింది. దీనిపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ ఆ అలవాటు మాత్రం సమసిపోవడం లేదు. కొన్ని సందర్భాల్లో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. కొన్నిసార్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తుంటారు. అయితే అన్నిసార్లు ఇవి సరైన దిశలో జరక్కపోవచ్చు. టీచర్లైనా, తల్లిదండ్రులైనా తప్పుడు సమాచారం ఆధారంగా కూడా కొన్నిసార్లు ఇలాంటి వాటికి దిగుతుంటారు.

Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో దోషుల ముందస్తు విడుదలపై సుప్రీం సంచలన నిర్ణయం

ఇక తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రులు ఒక టీచర్‌ను విపరీతంగా కొట్టారు. విషయం కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేశారు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని టుటికోరిన్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడిని ఆర్ భరత్‌గా గుర్తించారు. పాఠం చెప్తున్న టీచర్ దగ్గరికి పరుగుపరుగున వచ్చిన తల్లిదండ్రులు, తమ కుమారుడిని కొట్టడాని ఆరోపిస్తూ దాడి చేయడం ప్రారంభించారు. అయితే తాను అలా ప్రవర్తించలేదని ఆ టీచర్ బతిమాలుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తీవ్ర ఆవేశంలో ఉన్న ఆ ఇద్దరు సదరు ఉపాధ్యాయుడిని పరిగెత్తించి మరీ కొట్టారు. “బిడ్డను కొట్టడం చట్టవిరుద్ధం. మీకు హక్కులు ఎవరు ఇచ్చారు? నేను నిన్ను నా చెప్పులతో కొడతాను” అంటూ విద్యార్థి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Indian Embassy In UK: భారత్ రియాక్షన్‭తో లండన్‭లో మారిన సీన్.. భారత ఎంబసీ ముందు టైట్ సెక్యూరిటీ

భార్యాభర్తలు భరత్‌పై దాడి చేస్తుండడంతో మరో టీచర్ సహాయం కోసం కేకలు వేసింది. పోలీసులు దంపతులతో పాటు చిన్నారి తాత మునుసామిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాడి, నేరపూరిత బెదిరింపు, కుట్ర, ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వర్తించకుండా నిరోధించడం వంటి నేరాలకు మేము వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ బాలాజీ శరవణన్ చెప్పారు. ఏడేళ్ల చిన్నారి క్లాస్‌లో ఇతర పిల్లలతో గొడవపడుతుండడంతో సీటు మార్చాల్సిందిగా ఉపాధ్యాయురాలు ఆమెను కోరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సీట్లు మారుతున్న సమయంలో ఆమె పడిపోయిందని పోలీసులు తెలిపారు. టీచర్ తనను కొట్టాడని చిన్నారి ఇంటికి వెళ్లి తాతయ్యకు ఫిర్యాదు చేసింది.