Vaishali Kidnap Case : కిడ్నాప్ వెనుక ఎంతో పెయిన్ ఉంది, నన్ను నెగిటివ్‌గా చూడొద్దు.. వైశాలి కిడ్నాప్‌పై నవీన్ సెల్ఫీ వీడియో

Vaishali Kidnap Case : కిడ్నాప్ వెనుక ఎంతో పెయిన్ ఉంది, నన్ను నెగిటివ్‌గా చూడొద్దు.. వైశాలి కిడ్నాప్‌పై నవీన్ సెల్ఫీ వీడియో

Vaishali Kidnap Case : వైశాలిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూసిన కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఎట్టకేలకు చిక్కాడు. గోవాలో నక్కిన నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నవీన్ గోవాలో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.

గోవాలోని కాండోలిమ్ బీచ్ దగ్గర నవీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. కాగా, వైశాలి కిడ్నాప్ వ్యవహారంపై ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి.. సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. వైశాలిని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనే దానిపై ఆ వీడియోలో చెప్పాడు. తాను చేసిందే తప్పే అని అంగీకరించిన నవీన్.. వైశాలి కిడ్నాప్ వెనుక ఎంతో పెయిన్ ఉందని చెప్పాడు.

Also Read..Vaishali Kidnap Remand Report : పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్.. వైశాలి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

‘అందరూ తనను నెగిటివ్ గా చూస్తున్నారు. అబ్బాయిదే తప్పు అంటున్నారు. నేను అడిగేది ఒక్కటే. నాకు జరిగినట్టే అమ్మాయికి జరిగి ఉంటే మీరు ఏం చేసేవాళ్లు. ఇంతే సైలెంట్ గా ఉండేవాళ్లా? మీడియాలో నన్ను ఏ విధంగా అయితే బ్లేమ్ చేస్తున్నారో అదే అమ్మాయి అయి ఉంటే ఇలా జరిగి ఉండేదా? మీడియాకు నేను చేసే రిక్వెస్ట్ ఒక్కటే. ఈ ఇష్యూని ఒక అమ్మాయిది లేదా ఒక్క అబ్బాయిది అన్నట్లుగా కాకుండా ఇది ఒక ఫ్యామిలీది. ఒక మనసుకి సంబంధించినది అని వేలో చూడండి. కొంచెం పాజిటివ్ వే థింక్ చేయండి. దీన్ని పర్సనల్ గా, నెగిటివ్ గా చూడొద్దు’ అని సెల్ఫీ వీడియోలో రిక్వెస్ట్ చేశాడు నవీన్ రెడ్డి.

డిసెంబర్‌ 9న మధ్యాహ్నం 12 గంటల సమయంలో 40 మందితో కలిసి వైశాలి ఇంటికి వెళ్లిన నవీన్.. నానా బీభత్సం సృష్టించాడు. వైశాలి ఇంటిపై దాడి చేశాడు. ఆమె తల్లిదండ్రులను, బంధువులను కొట్టాడు. వైశాలిని కిడ్నాప్‌ చేశాడు. వైశాలిని కిడ్నాప్‌ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లాడు. అయితే,, తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయం తెలిసి నవీన్‌ రెడ్డి, అతడి అనుచరులు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. పోలీసులు గాలింపు ముమ్మరం చేసే సరికి నవీన్ రెడ్డి పరార్ అయ్యాడు. నవీన్ స్నేహితుడు.. వైశాలిని తీసుకుని హైదరాబాద్ కు వచ్చాడు. పోలీసులు యువతిని కాపాడి ఇంటికి తీసుకెళ్లారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ముమ్మరంగా దర్యాఫ్తు చేపట్టారు.

Also Read..Naveen Reddy Arrest : ఎట్టకేలకు దొరికాడు.. గోవాలో బీచ్ దగ్గర నవీన్‌ రెడ్డి అరెస్ట్, ఆదిభట్ల యువతి కిడ్నాప్‌ కేసులో పురోగతి

ఇక నవీన్ రెడ్డి పై లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు నవీన్ రెడ్డి మహాముదురు అని గుర్తించారు. నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెడతామన్న పోలీసులు.. పాత కేసులను తిరిగి తోడుతున్నారు. నవీన్ నేరచరిత్ర గురించి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వరంగల్, హైదరాబాద్ పోలీస్ స్టేషన్లలో నవీన్ రెడ్డి పై నమోదైన కేసులు వెలుగుచూశాయి. ఇంకా నవీన్ రెడ్డిపై ఎక్కడెక్కడ ఏయే కేసులు ఉన్నాయన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.