MIM Corporator Arrest : భోలక్‌పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్ అరెస్ట్‌

నగరంలో కొందరు కార్పొరేటర్లు హద్దులు మీరి రెచ్చిపోతున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసులపైనా పబ్లిగ్‌గా గొడవ పడుతున్నారు.

MIM Corporator Arrest : భోలక్‌పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్ అరెస్ట్‌

Mim Corporater

MIM Corporator Arrest : ఏ స్థాయి ప్రజాప్రతినిధులైనా ఆదర్శవంతంగా నిలవాలి. పరిపాలన కొనసాగించే అధికారులకు, శాంతి భద్రతల్ని పరిరక్షించే పోలీసులకు సహాకరించాలి. వారికి మార్గదర్శకంగా ఉండాలి. అలా కాకుండా రౌడిలా ప్రవర్తిస్తే ఏం అవుతుంది..? జైలుకు వెళ్లాల్సి వస్తుంది. హైదరాబాద్‌లో ఓ కార్పొరేటర్‌కు అదే జరిగింది. విధి నిర్వహ‌ణ‌లో ఉన్న పోలీసుల‌తో దురుసుగా ప్రవ‌ర్తించిన భోల‌క్‌పూర్ MIM కార్పొరేట‌ర్ మ‌హ్మద్ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గౌసుద్దీన్‌పై 353, 506 IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ తర్వాత గౌసుద్దీన్‌ను పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

నగరంలో కొందరు కార్పొరేటర్లు హద్దులుమీరి రెచ్చిపోతున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసులపైనా పబ్లిగ్‌గా గొడవ పడుతున్నారు. తమను ప్రశ్నించడానికి వీల్లేదంటూ ఖాకీలపై వీరంగం వేస్తున్నారు. కార్పొరేటర్ల తీరుతో ఏం చేయలో అర్థం కాని దుస్థితిలో పోలీసులు సైతం నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ముషిరాబాద్ నియోజకవర్గంలో MIM కార్పొరేటర్ గౌసుద్దీన్‌ అలా ప్రవర్తించే ఇప్పుడు జైలుకు వెళ్లాడు.

MLA Mumtaz Khan : ఎంఐఎం ఎమ్మెల్యే దౌర్జన్యం…నమస్తే పెట్టలేదని యువకుడిపై దాడి

హైదరాబాద్‌లో రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులపై నోరుపారేసుకున్నాడు గౌసుద్దీన్‌. అర్థరాత్రి దాటిపోయినా హోటల్‌ తెరిచి ఉంచడాన్ని.. పోలీసులు ప్రశ్నించగా.. రెచ్చిపోయిన గౌసుద్దీన్ కనీస మర్యాద కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట అనేశాడు. రంజాన్‌ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామంటూ గౌసుద్దీన్‌ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు స్పష్టం చేశాడు. అయితే.. తమకు పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని.. సమయానికి హోటళ్లను మూసివేయాలని పోలీసులు చెప్పబోయారు.

ఇంతలోనే మీరు 100 రూపాయలకు పనిచేసే మనుషులు..ఇక్కడకు కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ వచ్చాడని.. మీ SI, సీఐకి చెప్పండంటూ రుబాబు ప్రదర్శించాడు. రంజాన్ నెలపాటు ఇటు వైపు రావొద్దంటూ పోలీసులకు చెప్పాడు. ఈ గొడవంతా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి ప్రవర్తనను అసలు ఊరుకోవద్దంటూ డీజీపీకి ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేశారు. పార్టీ ఏదైనా.. గొడవ చేసింది ఎవరైనా కఠిన చర్యలు తీసుకోడంటూ సీరియస్‌ అయ్యారు కేటీఆర్. దీంతో సీన్‌లోకి దిగిన పోలీసులు గౌసుద్దీన్‌ను అరెస్ట్ చేశారు.