Uttarakhand : పెళ్లి వేడుకకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. బస్సు లోయలో పడి 14 మంది మృతి

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బస్సు లోయలో పడిపోవడంతో 14 మంది మృతి చెందారు. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Uttarakhand : పెళ్లి వేడుకకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. బస్సు లోయలో పడి 14 మంది మృతి

Accident (1)

bus plunged into a Valley : అప్పటి వరకు అంతా సందడిగా గడిపారు. పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా గడిపారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. కానీ.. ఆ సంతోషం ఎంతో సేపు లేకుండా పోయింది. అప్పటి వరకు జరిగిన పెళ్లి సంగతులను ముచ్చటిస్తూ.. తిరుగు పయనమైన వారిని మృత్యువు కబలించింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదం.. 14మంది ప్రాణాలను బలిగొంది.

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బస్సు లోయలో పడిపోవడంతో 14 మంది మృతి చెందారు. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది చనిపోయారు. డెహ్రాడున్ సమీపంలోని బుడంలో పెళ్లి వేడుకలకు హాజరైన వారంతా.. తిరిగి ఇళ్లకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.

Nagar Kurnool : స్నేహితుడి పెళ్లికి వెళ్లొస్తుండగా విషాదం.. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి

సుఖిదాంగ్ రీతా సాహిబ్ రోడ్డుపై ఒక్కసారిగా ఆదుపుతప్పి.. చంపావత్ లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 14మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయ. దీంతో పెళ్లి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.