Business With Dead Bodies : వామ్మో.. 560 మృతదేహాలను నరికి శరీర భాగాలు అమ్ముకుంది, డెడ్ బాడీస్‌తో బిజినెస్

వామ్మో.. ఇది అలాంటి ఇలాంటి మోసం కాదు. కళ్లు బైర్లు కమ్మే చీటింగ్. ఇలాంటి ఫ్రాడ్ గురించి ఇంతవరకు విని ఉండరంటే అతిశయోక్తి కాదు. డెడ్ బాడీస్ తో వ్యాపారం. ఏంటి.. షాక్ అయ్యారు కదూ.

Business With Dead Bodies : వామ్మో.. 560 మృతదేహాలను నరికి శరీర భాగాలు అమ్ముకుంది, డెడ్ బాడీస్‌తో బిజినెస్

Updated On : January 4, 2023 / 11:35 PM IST

Business With Dead Bodies : వామ్మో.. ఇది అలాంటి ఇలాంటి మోసం కాదు. కళ్లు బైర్లు కమ్మే చీటింగ్. ఇలాంటి ఫ్రాడ్ గురించి ఇంతవరకు విని ఉండరంటే అతిశయోక్తి కాదు. డెడ్ బాడీస్ తో వ్యాపారం. ఏంటి.. షాక్ అయ్యారు కదూ. అవును, నిజమే. ఆ మహిళ చివరికి డెడ్ బాడీస్ తోనూ బిజినెస్ చేసింది. మృతదేహాలకు అంత్యక్రియల మాటున.. చట్టవిరుద్ధంగా శరీర భాగాలు అమ్ముకుని సొమ్ము చేసుకుంది. మృతుల బంధువులకు నకిలీ అస్తికలు ఇచ్చి మోసం చేసింది.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలో అంత్యక్రియల భవన యజమాని మేగాన్ హెస్ పాపం పండింది. స్థానిక ఫెడరల్ కోర్టు ఆమెకి కఠిన శిక్ష వేసింది. 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. మేగాన్ హెస్.. చట్ట విరుద్ధంగా 560 శవాలను ముక్కలు చేసి వాటి శరీర భాగాలను అమ్ముకుంది. విచారణలో ఇది నిజం అని తేలింది. అంత్యక్రియలు జరిగే భవనం నుంచే ‘బాడీ పార్ట్స్ డోనర్ సర్వీసెస్’ అనే బిజినెస్ చేసిందని తేలడంతో పోలీసులు కంగుతిన్నారు. ఇక మేగాన్ హెస్ తల్లి షిర్లీ కోచ్ కూడా ఇదే పని చేసినట్లు తేలడంతో కోర్టు ఆమెకు కూడా 15ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Also Read..Man Beaten With Sticks : షాకింగ్.. అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లగా.. ప్యాంటు విప్పి పిచ్చకొట్టుడు కొట్టారు

అక్రమంగా శరీర భాగాలను విక్రయించడం, మృతుల బంధువులకు నకిలీ అస్తికలు ఇవ్వడం.. ఇవీ కొలరాడో అంత్యక్రియల గృహ నిర్వాహకురాలి మోసాలు. మృతుల కుటుంబాలకు తెలియకుండా పరిశోధన కోసం డెడ్ బాడీస్ ను లేదా వాటి శరీర భాగాలను ఇచ్చేది మేగాన్ హెస్. హెస్(48), ఆమె తల్లి కోచ్(69) పశ్చిమ నగరమైన మాంట్రోస్‌లో సన్‌సెట్ మీసా ఫ్యూనరల్ హోమ్‌ను నిర్వహిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మృతదేహాలను అప్పగిస్తే దహన సంస్కారాలు చేసి అస్తికలను కుటుంబసభ్యులకు ఇస్తామని మేగాన్ చెప్పారు. అయితే, సేవ మాటున వ్యాపారం షురూ చేసింది. డెడ్ బాడీస్ ను కట్ చేసి శరీర భాగాలను విక్రయించడం మొదలు పెట్టింది. హెచ్‌ఐవి, హెపటైటిస్ బి, సితో సహా అంటువ్యాధులకు పాజిటివ్ పరీక్షలు చేసిన లేదా మరణించిన వ్యక్తులకు చెందిన శరీరాలు, శరీర భాగాలను రవాణా చేశారు.

Also Read..Metro Station Woman Dragged : మెట్రో స్టేషన్‌లో షాకింగ్ ఘటన.. యువతిని ఈడ్చుకెళ్లిన రైలు