CBI Case : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సీబీఐ కేసు నమోదు

ఎర్రచందనం దుంగలను పైపులంటూ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు సతీశ్, నజీబ్ లకు ముగ్గురు కస్టమ్స్ అధికారులు సహకరించారు.

CBI Case : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సీబీఐ కేసు నమోదు

Cbi

red sandalwood smuggling : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సీబీఐ కేసు నమోదు అయింది. ముగ్గురు కస్టమ్స్ అధికారులతో పాటు స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.

ఎర్రచందనం దుంగలను పైపులంటూ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు సతీశ్, నజీబ్ లకు ముగ్గురు కస్టమ్స్ అధికారులు సహకరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ సతీశ్, నజీబ్ లు పట్టుబడ్డారు. కస్టమ్స్ శాఖలో సూపరింటెండెంట్ లుగా పని చేస్తున్న వెంకటేశ్, అనంత పద్మనాభరావుపై కేసు నమోదు చేశారు.

Omicron Death : భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం..?

బెంగళూరు ఎయిర్ పోర్టులో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తోన్న రవీందర్ పవార్ పై కేసు నమోదు అయింది. రాయలసీమ నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.