CBI Probes : DHFL స్కామ్‌లో సీబీఐ సోదాలు..అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ స్వాధీనం

దేశంలో సంచలనం సృష్టించిన DHFL స్కామ్‌లో సీబీఐ అధికారులు అనేకచోట్ల సోదాలు నిర్వహించారు. పుణేలో నిందితుడు, ప్రాపర్టీ బిల్డర్ అవినాష్ భోసాలేకు చెందిన ఓ ప్రాంగణంలోనూ తనిఖీలు చేశారు. అక్కడ హ్యాంగర్ తరహాలో నిర్మితమైన పెద్ద హాలులో నిలిపివున్న ఓ అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్‌ను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. అనంతరం దానిని స్వాధీనం చేసుకున్నారు.

CBI Probes : DHFL స్కామ్‌లో సీబీఐ సోదాలు..అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ స్వాధీనం

Dhfl

DHFL scam : దేశంలో సంచలనం సృష్టించిన DHFL స్కామ్‌లో సీబీఐ అధికారులు అనేకచోట్ల సోదాలు నిర్వహించారు. పుణేలో నిందితుడు, ప్రాపర్టీ బిల్డర్ అవినాష్ భోసాలేకు చెందిన ఓ ప్రాంగణంలోనూ తనిఖీలు చేశారు. అక్కడ హ్యాంగర్ తరహాలో నిర్మితమైన పెద్ద హాలులో నిలిపివున్న ఓ అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్‌ను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.

అనంతరం దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆ హాలులో అన్నీ పాప్ సంగీత సంస్కృతిని ప్రతిబింబించే పోస్టర్లున్నాయి. ఈ కేసులో ఇప్పటికే DHFL ఉన్నతాధికారులు కపిల్ వాధ్వాన్, దీపక్ వాధ్వాన్ తదితరులపై సీబీఐ చార్జిషీట్లు నమోదు చేసింది. 17 బ్యాంకులను మోసం చేసినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొంది. షేల్ కంపెనీలు సృష్టించడమే కాకుండా…పబ్లిక్ ఫండ్‌ను మళ్లించింది.

DHFL Scam : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్..DHFL​లో​ రూ.34,615 కోట్ల అవినీతి

గత నెల జరిపిన సోదాల్లో కోటీ రూపాయలు విలువ చేసే 25 లగ్జరీ చేతి గడియారాలు, 38 కోట్ల విలువ చేసే 56 పెయింటింగ్స్ సీజ్ చేశారు. 34 వేల కోట్లకు సంబంధించి దివాన్ హౌసింగ్ కార్పోరేషన్ అవతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి సీబీఐ కొన్ని రోజులు ఆ సంస్థకు చెందిన అనేక చోట్ల సోదాలు చేస్తోంది.