Karvy MD Parthasarathy : కార్వీ ఎండీ, సీఎఫ్ఓ ఈడీ కార్యాలయానికి తరలింపు

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రూ.2873.82 కోట్ల మోసాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. కార్వీ గ్రూప్ నుండి 14 షెల్ కంపెనీలకు ఈ నగదు మొత్తం బదిలీ చేసినట్లు తేల్చింది.

Karvy MD Parthasarathy : కార్వీ ఎండీ, సీఎఫ్ఓ ఈడీ కార్యాలయానికి తరలింపు

Karvy

Updated On : January 28, 2022 / 11:59 AM IST

karvy MD Parthasarathy, CFO Krishna : కార్వీ ఎండి పార్థసారథితో పాటు సీఎఫ్ఓ కృష్ణలను ఈడీ కార్యాలయానికి తరలించారు. మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభంకానుంది. నిన్న చంచల్‌గూడ జైలు నుండి కస్టడిలోకి ఈడి అధికారులు తీసుకున్నారు. కార్వీ కేసులో రెండో రోజు ఈడీ విచారణ సాగనుంది. ఎండీ పార్థసారథితో పాటు సీఎఫ్ఓ కృష్ణ హరిలను కష్టడీకి తీసుకొని ఈడీ విచారిస్తోంది.

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ 2873.82 కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. కార్వీ గ్రూప్ నుండి 14 షెల్ కంపెనీలకు ఈ నగదు మొత్తం బదిలీ చేసినట్లు నిగ్గుతేల్చింది. ఇప్పటికే 700 కోట్ల రూపాయలు పార్థసారథికి చెందిన షేర్ హోల్డింగ్ ను ఈడీ సీజ్ చేసింది.

Mahesh Bank Hacking Case : మహేశ్ బ్యాంక్‌ హ్యాకింగ్‌ కేసు.. కీలక అనుమానితురాలి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌

మిగిలిన 2 వేల కోట్లు ఎక్కడకు తరలించారన్న దానిపై పార్థసారథి, కృష్ణ హరిలను విచారిస్తున్నారు. విదేశాలకు మనీ లాండరింగ్ ద్వారా నిధులు మల్లించారన్న కోణంలో ఈడీ విచారిస్తోంది. 2 వేల కోట్లు ఏ విధంగా దారి మళ్లించారనే దానిపై దృష్టి సారించింది.