Gang Rape: బాలికపై సామూహిక అత్యాచారం.. లక్ష పరిహారం ప్రకటించిన పెద్దలు

ఈ ఘటన జష్పూర్ జిల్లాలో గత శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న బాలిక తన తండ్రితో కలిసి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని, బాలికను ఎత్తుకెళ్లారు. దగ్గర్లోని అటవీప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

Gang Rape: బాలికపై సామూహిక అత్యాచారం.. లక్ష పరిహారం ప్రకటించిన పెద్దలు
ad

Gang Rape: ఛత్తీస్‌ఘడ్‌లో దారుణం జరిగింది. పదహారేళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జష్పూర్ జిల్లాలో గత శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న బాలిక తన తండ్రితో కలిసి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని, బాలికను ఎత్తుకెళ్లారు. దగ్గర్లోని అటవీప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నలుగురు కలిసి బాలికపై అత్యాచారం చేసి, తర్వాత అడవిలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఊరి పెద్దలు పంచాయితీ నిర్వహించారు.

Woman Suicide: లోన్ యాప్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

సర్పంచ్‌తోపాటు పలువురు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ సందర్భంగా బాలికకు నష్టపరిహారం కింద నిందితులు రూ.లక్ష ఇచ్చేందుకు తీర్మానించారు. ఈ కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా, సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించారు. అయితే, వ్యవహారం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితులను అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, కేసు దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.