Woman Suicide: లోన్ యాప్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

రెండు రోజుల నుంచి ప్రత్యూషకు వాట్సాప్‌లో అసభ్యకరమైన మెసేజులు పంపుతూ, నిరంతరంగా కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్రంగా వేధించడంతో మనస్థాపానికి గురైన ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Woman Suicide: లోన్ యాప్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

Woman Suicide

Woman Suicide: లోన్ యాప్‌ల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా చినకాకానిలో ఈ ఘటన జరిగింది. ప్రత్యూష అనే వివాహిత లోన్ యాప్ నుంచి రూ.20 వేలు అప్పుగా తీసుకుంది. తర్వాత రూ.12 వేలు చెల్లించింది.

Cute Charge: ‘క్యూట్ చార్జి’ వసూలు చేస్తున్న ఇండిగో.. నెటిజన్ల జోకులు

అయితే, సమయానికి మిగతా రుణం చెల్లించకపోవడంతో లోన్ యాప్ కాల్ సెంటర్ నిర్వాహకుల నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల నుంచి ప్రత్యూషకు వాట్సాప్‌లో అసభ్యకరమైన మెసేజులు పంపుతూ, నిరంతరంగా కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్రంగా వేధించడంతో మనస్థాపానికి గురైన ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వెళ్లగక్కింది. ‘‘లోన్ యాప్స్ నుంచి నేనే రుణం తీసుకున్నాను. బాగా ప్రెజర్ పెడుతున్నారు. నావల్ల కావట్లేదు ఇంకా. ఇప్పుడు ఏడింటిలోపల కట్టకపోతే నా పిక్స్ న్యూడ్ పిక్స్‌లాగా చేసి పెడతాను అంటున్నారు. ఓన్లీ నా మొహం ఒక్కటే ఉంటది వాళ్ల దగ్గర. దానిని వేరే పిక్చర్స్‌కు అటాచ్ చేసి పెడతానని టార్చర్. ఆల్రెడీ వేరేవాళ్లందరికీ మెసేజ్‌లు వెళ్లినాయంట.

Vegetable Prices: వర్షాల ప్రభావం.. కూరగాయల ధరలు పెరుగుతాయా?

నిన్నంతా నేను మాట్లాడింది లోన్ వాళ్లతోనే. ఐయామ్ సారీ. వీలైతే క్షమించు. ఇక నావల్ల కావట్లేదు. నేను ఫేస్ చేయలేకపోతున్నాను ఈ ప్రాబ్లమ్‌ని’’ అంటూ ఆ వీడియోలో చెప్పింది. అనంతరం ఆత్మహత్య చేసుకుంది. అయితే, ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. ఫోన్, వాట్సాప్ ద్వారా నిర్వాహకులు వేధిస్తూనే ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.