Coimbatore : నడి రోడ్డుపై ప్రేమ జంట కిడ్నాప్.. కాపాడిన ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు

కోయంబత్తూరులోని లక్ష్మీ మిల్ సిగ్నల్ వద్ద ఓ కారులో యువ జంటను లోపలికి తోసేందుకు ప్రయత్నిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. కారు లోపలికి వెళ్లేందుకు యువకుడు అడ్డుకుంటున్నాడు. తమను...

Coimbatore : నడి రోడ్డుపై ప్రేమ జంట కిడ్నాప్.. కాపాడిన ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు

Coimbatore

Coimbatore Lovers Kidnapped Live : ఓ ప్రేమ జంట కిడ్నాప్ కు సంబంధించిన లైవ్ వీడియో తీవ్ర కలకలం రేపింది. తమను కిడ్నాప్ చేయడానికి రౌడీలు వచ్చారని.. వారి చేతుల్లో కత్తులు, ఇతర మారణాయుధాలున్నాయని..తమను కాపాడాలని వారు వేడుకున్నారు. సినిమా సీన్ తలపించిన రియల్ కిడ్నాప్ ఘటన కోయంబత్తూరులో చోటు చేసుకుంది. చివరకు రౌడీల నుంచి ఆ ప్రేమ జంటను ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు కాపాడారు. వీరిని కిడ్నాప్ చేసేందుకు యువతి తండ్రి పథకం పన్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Read More : Yami Gautam : లైంగిక వేధింపుల బాధితుల కోసం ముందుకొచ్చిన యామి గౌతమ్

కోయంబత్తూరులోని లక్ష్మీ మిల్ సిగ్నల్ వద్ద ఓ కారులో యువ జంటను లోపలికి తోసేందుకు ప్రయత్నిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. కారు లోపలికి వెళ్లేందుకు యువకుడు అడ్డుకుంటున్నాడు. తమను కాపాడాలని అతను కేకలు వేయడం… సిగ్నల్ వద్ద కారు ఆగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. తోటి వాహనదారులు, ట్రాఫిక్ సిబ్బంది స్పందించారు. కిడ్నాప్ చేస్తున్న వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. అనంతం ఆ యువ జంటను సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. తమకు రక్షణ కల్పించాలని వారు కేకలు వేయడం… వాహనాలు బారులు తీరి నిలవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వారిని విచారించారు. విఘ్నేశ్వర్, స్నేహలు Maniyakarampalayam ప్రాంతానికి చెందిన వారుగా తేలింది. వీరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. కానీ.. కారులో తమను కిడ్నాప్ చేస్తున్నారని సహాయం కోసం రోడ్డుపై ఆర్తనాదాలు చేశారు.

Read More : Telangana : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌‌లో కీలక విషయాలు.

కత్తులతో వచ్చారని, మమ్మల్ని చంపేస్తారని, మా ఇద్దరిని కాపాడండి అంటూ రోడ్డు మీద ఉన్న వారిని ప్రేమజంట వేడుకుంది. సహాయం కోసం కనిపించిన వారి కాళ్ళమీద పడి ప్రాధేయపడ్డారు. రౌడీల దగ్గరనుండి ప్రేమజంటని ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు కాపాడారు. తన తల్లిదండ్రులే తమను చంపేస్తారని యువతి కేకలు వేసింది. బాలిక తల్లిదండ్రులను, కారును స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. శరవణంపాటి పీఎస్ లో కేసు నమోదైంది. వారి ప్రేమ వివాహంపై యువతి కుటుంబసభ్యుల ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. గత రాత్రి ప్రేమజంటని రౌడీల సహాయంతో కిడ్నాప్ చేయడానికి స్నేహ తండ్రి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఫై విచారణ చేపట్టారు పోలీసులు.