Cheated Aunties, Young Girls : కడప ప్లే బోయ్ … సోషల్ మీడియా ద్వారా 300 మంది మహిళలను…

ఒకళ్లా ఇద్దరా ఏకంగా 300 మంది మహిళలకు సంబంధించిన ఫోటోలు చూసి పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.  ఒక కేసులో  బాధితుడు ఇచ్పిన ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్ట్ చేయటంతో ఈ  ప్లేబోయ్  బాగోతం బయటపడింది. 

10TV Telugu News

Cheated Aunties, Young Girls : వయస్సు చూస్తే పాతికేళ్ళలోపు .. నూనూగు మీసాల అందగాడు…తన అందంతో… మాటలతో    సోషల్ మీడియాలో   పరిచయం   అయిన యువతులను,   మహిళలను లోబరుచుకున్నాడు. కుదిరితే వారితో శారీరకంగా కలిసేవాడు…. లేదా వారి అర్ధనగ్న చిత్రాలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఒకళ్లా ఇద్దరా ఏకంగా 300 మంది మహిళలకు   సంబంధించిన ఫోటోలు చూసి పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.  ఒక కేసులో  బాధితుడు ఇచ్చిన  ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్ట్ చేయటంతో ఈ  ప్లేబోయ్  బాగోతం బయటపడింది.

కడప జిల్లా  ప్రొద్దుటూరు  గీతాశ్రమం వీధికి చెందిన  చెన్నుపల్లి   ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంతి రెడ్డి, అలియాస్ రాజారెడ్డి, అలియాస్ టోనీ (23) బీటెక్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేశాడు. జల్సాలకు,విలాసాలకోసం 2017 నుంచి చైన్ స్నాచింగ్ లు మొదలు పెట్టాడు.   ప్రొద్దుటూరు,టూటౌన్, త్రీటౌన్, చాపాడు సీఎస్‌ల  పరిధిలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు.

2020లో   ప్రసన్నకుమార్‌కు  నబీకోటకు  చెందిన శ్రీనివాస్  అనే వ్యక్తి   షేర్‌చాట్ ద్వారా పరిచయం అయ్యాడు. శ్రీనివాస్‌తో  తనపేరు ప్రశాంత్ రెడ్డి, అలియాస్ రాజారెడ్డి అని,  హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో   ఉద్యోగం చేస్తానని అక్కడ చాలామంది తెలుసని చెప్పి పరిచయం చేసుకున్నాడు.  శ్రీనివాస్ కు సెక్రటేరియట్ లో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతని తల్లిని నమ్మించాడు.

తన తల్లికి అనారోగ్యంగా ఉందని, చికిత్స చేయించటానికి  డబ్బులు కావాలని అడిగాడు. అతని మాయమాటలు నమ్మిన శ్రీనివాస్ తల్లి తన బంగారు సరుడు, తాళిబొట్టు అమ్మి డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ప్రసన్నకుమార్ కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు.

జులై 29న కడప జిల్లా అక్కాయపల్లెలో  ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన తాళం చెవితో  ఇంటిలోకి   ప్రవేశించి  బీరువాలోని  సుమారు 30 గ్రాముల బంగారు గాజులు,  కమ్మలు, రెండు ఉంగరాలు,  ఒక చెవి రింగును దొంగిలించి  పరారయ్యాడు.  ఈలోగా శ్రీనివాస్ తాను మోసపోయానని   గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసుల చాకచక్యంగా ప్రసన్నకుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

నిందితుడ్ని అదుపులోకి  తీసుకుని విచారించే క్రమంలో  అతని స్మార్ట్ ఫోన్ చూసిన పోలీసులకు దిమ్మ తిరిగే  విషయాలు వెలుగు చూశాయి.  బీటెక్ చదువు మధ్యలోనే ఆపేసిన ప్రసన్న కుమార్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం లైన   షేర్‌చాట్,   ఫేస్‌బుక్,  ఇన్‌స్టాగ్రామ్‌ వంటి మాధ్యమాల ద్వారా అమ్మాయిలను  మధ్య వయస్సు మహిళలకు వలవేసేవాడు. వారిని తనమాయమాటలతో పరిచయం చేసుకుని ప్రేమలోకి దించేవాడు.  తర్వాత వారితో డబుల్ మీనింగ్ డైలాగులతో అసభ్యకరంగా చాట్ చేసేవాడు.

Most Wanted Criminal

Most Wanted Criminal

వారికి మాయమాటలు చెప్పి వారిని లోబరుచుకునేవాడు. అవకాశం ఉన్నవారితో సన్నిహితంగా గడిపేవాడు. లేకపోతే వారి అర్ధనగ్న, నగ్న చిత్రాలు,  వీడియోలు తీసుకునేవాడు. సన్నిహితంగా ఉన్నవారితో  కూడా ఫోటోలు వీడియోలు తీసుకుని వాటిని సేవ్ చేసుకుని తద్వారా వారిని బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టేవాడు.  వారిని శారీరకంగా అనుభవించాక వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు తస్కరించి వాటిని అమ్ముకుని ఆ డబ్బులతో జల్సా చేసేవాడు.

మహిళల   ఫోటోలు వీడియోలు వారికి పంపించి  బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడేవాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ ఫోటోలు సోషల్   మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు. వారి వద్దనుంచి నగదు, బంగారం వసూరు చేసేవాడు. చాలామంది మహిళలు ఈవిషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని మిన్నకుండిపోయేవారు.  పరువుకు సంబంధించిన విషయం అవటంతో ఎవరూ ఫిర్యాదు చేయటానికి ముందుకు రాలేదు.

ఉద్యోగం ఇప్పిస్తాననే విషయంలో శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు  విచారించగా ఈవిషయాలు వెలుగులోకి వచ్చాయి.  ప్రసన్నకుమార్  ఇప్పటి వరకు దాదాపు 100 మహిళలు,  200 మంది యువతులను  మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.  నిందితుడి వద్దనుంచి రూ. 1.26 లక్షలు నగదు, 30 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

10TV Telugu News