Rave Party : కూకట్‌పల్లిలో రేవ్‌పార్టీని భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్ కూకట్‌పల్లిలో కొందరు యువకులు ఏర్పాటు చేసుకున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 

Rave Party : కూకట్‌పల్లిలో  రేవ్‌పార్టీని భగ్నం చేసిన పోలీసులు

Hyd Kukatpallu Rave Party

Updated On : November 28, 2021 / 2:03 PM IST

Rave Party : హైదరాబాద్ కూకట్‌పల్లిలో కొందరు యువకులు ఏర్పాటు చేసుకున్న   రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.  కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో ఒక ఇంటిలో   రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.  పార్టీకి హాజరయ్యేందుకు 300 రూపాయలు ఎంట్రీ ఫీజు వసూలు చేశారు నిర్వాహకులు ఇమ్రాన్, దయాల్.

పార్టీకి దాదాపు 42  మంది  యువకులు హజరయ్యారు. ఇంటి నుంచి పెద్దఎత్తున డీజే సౌండ్ రావటంతో ఇంటి చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పార్టీ నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు అక్కడి నుంచి పెద్ద మొత్తంలో   మద్యం బాటిల్స్, కండోమ్ ప్యాకెట్లు, 2 హుక్కా పాట్స్, 3 హుక్కా ఫ్లేవర్లు, రెండు సెల్ ఫోన్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Woman Cheating : చిట్టీల పేరుతో రూ.12 కోట్ల మోసం చేసిన మహిళ
44 మంది యువకులతో పాటు మరో ఇద్దరు హిజ్రాలను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు.  హిజ్రాలతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  కాగా   వీరంతా స్వలింగ సంపర్కులుగా తేలటంతో…  నిర్వాహకులపై నిషేధిత హుక్కా వినియోగంపై కేసులు నమోదు చేసి మిగిలిన వారిపై పెట్టీ కేసులు నమోదు చేశారు.